జగన్ రెండో సారి ప్రమాణ స్వీకారం పేరుతో బొత్సతో పాటు ఇతర నేతలు చేస్తున్న హడావుడి చూసి వైసీపీ క్యాడర్ లో మిణుకుమిణుకుమంటున్న ఆశలు కూడా నీరుగారిపోతున్నాయి. ఓటి కుటుండకు సౌండ్ ఎక్కువన్నట్లుగా.. గెలిచే చాన్స్ లేనందునే ఇలా చేస్తున్నారని ఎక్కువ మంది అనుమానిస్తున్నారు.
సాధారణంగా ఫలితాలు ఈవీఎంలతో నిక్షిప్తమయ్యాక రాజకీయ పార్టీలు సంయమనం పాటిస్తాయి. ఫలితాలు అనుకూలంగా రావనుకున్నవారే క్యాడర్ లో ధైర్యం నింపేందుకు హడావుడి చేస్తారు. ఇప్పుడా పని వైసీపీ చేస్తోంది.
ఎట్టి పరిస్థితుల్లో గెలుస్తామని వైసీపీ తమ నమ్మకాన్ని ప్రజల ముందు ప్రదర్శించాలనుకుంటోంది. అది ప్రమాణస్వీకార ముహుర్తం.. ప్రమాణస్వీకార వేదిక ఏర్పాట్లు ప్రారంభించడం. . హోటల్ రూమ్స్ బుక్ చేసుకోవడం వరకూ వెళ్లడమే ఆసక్తికరంగా మారింది. ఓ వైపు జాతీయ స్థాయిలో ప్రముఖ సెఫాలజిస్టులు అందరూ ఈ సారి ఎన్నికల్లో ఏపీలో ప్రభుత్వం మారుతుందన్న అంచనాలను వేయడం ప్రారంభించారు. ఇవి జాతీయ మీడియాలో హైలెట్ అవుతున్నాయి.
అలాగే ఎన్నికలకు ముందు వచ్చిన జాతీయ మీడియాల ఒపీనియన్ పోల్స్ లోనూ వైసీపీకి సంతృప్తికరమైన ఫలితాలు రాలేదు. ఈ క్రమంలో వైసీపీ నేతల్లోనే గందరగోళం ఏర్పడింది. ఓ వైపు ఈసీ అక్రమాలు అని పోరాడుతూండటంతో ఫలితాలపై క్లారిటీ ఉందని.. అందుకే ఇలా చేస్తున్నారన్న అభిప్రాయం పెరుగుతోంది. దీన్ని కంట్రోల్ చేసేందుకే .. ప్రమాణస్వీకార తేదీ, ముహుర్తం, వేదిక పేరుతో హడావుడి చేస్తున్నారన్న అభిప్రాయం గట్టిగా ఉంది. ముఖ్య నేతల గెలుపు నమ్మకం ప్రదర్శన అతిగా ఉండటంతో తర్వాత ట్రోలింగ్ ను తట్టుకోలేమని వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు కూడా ఆందోళన చెందుతున్నారు.