విశాఖలో రాజధాని పెట్టినా… చంద్రబాబు సామాజికవర్గానికే లాభం కలుగుతుందట..! ఇంత గొప్ప అంచనా.. విశ్లేషణ చేసింది… చంద్రబాబు సామాజికవర్గానికి చెంది.. కులం వైరస్‌తో కునారిల్లుతున్న వ్యక్తి కాదు. ప్రజంలదర్నీ సమానంగా చూడాల్సిన బాధ్యతలో ఉన్న మంత్రి బొత్స సత్యనారాయణ చేసినది. విశాకలో రాజధాని పెడితే.. చంద్రబాబు సామాజికవర్గం వారే బాగుపడతారు.. తమకు.. తమ కులానికి ఏమీ లాభం లేదని.. ఆయన మీడియాతో బహిరంగంగానే చెప్పుకున్నారు. ఆయన మాటలు విని అందరూ ముక్కున వేలేసుకున్నారు. ప్రతీ నిర్ణయంలోనూ..ఇలా కులాలు..లాభాలు చూసుకోవడం ఎప్పటి నుండి ప్రారంభించారన్న అంశమే.. అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది.
రాజకీయాలు కులసమీకరణాలు ఆధారంగానే ఉంటాయి. అంత వరకూ అందరూ ఒప్పుకునే నిజం. అంత మాత్రాన.. ఓ కులాన్ని కించ పరిచి.. ఓ కులం లాభపడకూడదని.. మరో కులం లాభపడాలని..నిర్ణయాలు తీసుకోవడం మాత్రం ఇంత వరకూలేదు. తొలి సారి.. ఏపీ సర్కార్ ఆ పని చేస్తోంది. ఇలా చేయడానికి ఓ ప్రాతిపదిక కూడా వెదుక్కొంటోంది. మంత్రులంతా.. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా.. ప్రజలకు సేవల చేస్తామని .. వివక్షను చూపబోమని ప్రమాణం చేస్తారు. కానీ ఏపీలో మాత్రం.. ఓ కులం.. ఓ కులం అంటూ… తీవ్రమైన వ్యతిరేకత చూపుతూ.. నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని బొత్స సత్యనారాయణ లాంటి మంత్రులు బహిరంగంగానే చెబుతున్నారు. రాజధానిపై ఓకులం ముద్ర వేసి.. ఓ కులానికి మంచి చేయబోమంటూ ప్రకటనలు చేస్తున్నారు.
అమరావతి ఇప్పటికే ఓ కులందని.. బొత్స చాలా సార్లు చెప్పారు. దాన్ని ఇప్పుడు ఆయన విశాఖకు కూడా అంటించే ప్రయత్నం చేస్తున్నారు. విశాఖ పట్నం.. ఓ మినీ మెట్రో సిటీగా ఉంది. అక్కడ అన్ని వర్గాల ప్రజలూ ఉంటున్నారు. ప్రశాంత జీవనానికి విశాఖ పెట్టింది పేరు. ఎలాంటి అలజడులను వారు స్వాగతించరు. కానీ అక్కడ కూడా.. కులం కుంపట్లు పెట్టడానికి బొత్స సత్యనారాయమ సిద్ధమయినట్లుగా తెలుస్తోంది. అక్కడా చంద్రబాబు సామాజికవర్గమే లాభపడుతుందంటూ.. కొత్త వాదన తెరపైకి తీసుకు వచ్చారు. మొత్తానికి సర్కార్ ప్రజలు.. రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు… ప్రజల మధ్య.. కులం, మతం, ప్రాంతాల పేరుతో.. ఓ స్పష్టమైన విభజన రేఖను మాత్రం గీయాలనుకుంటోందదన్న విషయం మాత్రం స్పష్టమవుతోందంటున్నారు.