బొత్స సత్యనారాయణ టెన్షన్‌కు గురవుతున్నారు. తనకు కనీసం ఇంగ్లిష్ కూడా రాకపోయినా పెద్దగా చదువు లేకపోయినా విద్యాశాఖ ఇచ్చి తన పేరు మీద పెద్ద ఎత్తున జగన్ గ్యాంగ్ దోపిడీ చేసిందని ఇప్పుడు తాను అడ్డంగా ఇరుక్కుటున్నానని ఆయన ఫీలవుతున్నారు. అందుకే తరచూ ప్రెస్ మీట్లు పెట్టి.. పరోక్షంగా తనకే సంబంధం లేదని చెప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు
ఏపీలో వరుసగా వీసీలు రాజీనామాలు చేస్తున్నారు. వారిని వైస్ చాన్సలర్లు అనడం కంటే.. వైసీపీ కార్యకర్తలు అనడం కరెక్ట్. వారిలో చాలా మంది పెద్ద ఎత్తున డబ్బులు చెల్లించి పోస్టులు తెచ్చుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు పోస్టు కూడా ఊడింది కాబ ట్టి తమ డబ్బుల సంగతేమిటని.. బొత్సపై ఒత్తిడి తెస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. దీంతో ఆయన .. వీసీలను రాజీనామా చేయించడం కరెక్ట్ కాదని ప్రెస్‌మీట్ పెట్టేశారు. మరి వీసీలు చేస్తోంది కరెక్టా అంటే.. నీళ్లు నములుతున్నారు.
విద్యాశాఖలో బైజూస్, టోఫెల్, ఐబీ పేరుతో పెద్ద ఎత్తున దోపిడీ జరిగింది. ఇదంతా బయటకు తీస్తున్నారు. ఈ సమాచారం బొత్స సత్యనారాయణకు ఉంది. అందుకే గతంలో ఉన్నట్లుగా లేనని.. టీడీపీని ఏమీ అననని చెప్పడం ప్రారంభించారు. కానీ అమరావతిపై కుల ముద్ర వేసి అనుచిత వ్యాఖ్యలు చేయడంలో బొత్సనే ముందున్నారు. ఆయనను వదిలి పెట్టే అవకాశం ఉండదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.