వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు బొత్స సత్యనారాయణ వ్యవహారం హాట్ టాపిక్ అవుతోంది. ఆయన ఇటీవల ఢిల్లీకి సీక్రెట్ పర్యటన చేశారని వైసీపీకి అనుకూలంగా ఏకపక్షంగా ఉండే ఓ చానల్‌తో పాటు కొన్ని వెబ్సైట్లలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. బొత్స ఢిల్లీ వెళ్లి అశోకా హోటల్లో ఉన్నారని.. అక్కడ కొంత మంది బీజేపీ పెద్దలతో రహస్య మంతనాలు జరిపారని కూడా చెబుతున్నారు. ఇందులో ఎంత నిజం ఉందో ఎవరికీ తెలియడం లేదు కానీ.. ఇలాంటి వార్తలు.. వైసీపీ అనుకూల మీడియాలో రావడమే… ఏదో జరుగుతోందన్న అభిప్రాయానికి కారణం అవుతోంది.
సాధారణంగా వైసీపీలో అంతర్గతంగా ఏదైనా జరిగితే.. వైసీపీ చెప్పే .. యాంటీ వైసీపీ మీడియాలోనే హైలెట్ అవుతుంది. వైసీపీకి పూర్తిగా అనుకూలంగా జరిగితే… అది వారి అనుకూల మీడియాలో హైలెట్ కాదు. కానీ ఇక్కడ భిన్నంగా వైసీపీలో బొత్స ఏదో చేస్తున్నారంటూ.. రచ్చ ప్రారంభించింది వైసీపీ అనుకూల మీడియానే. అంటే.. ఈటల రాజేందర్ మంత్రిగా ఉండగానే.. ఆయనపై టీఆర్ఎస్ అనుకూల మీడియా ఎలా అయితే రచ్చ చేసిందో.. బొత్స పై కూడా అలాగే చేస్తున్నట్లుగా అనుకోవాలని అంటున్నారు. బొత్స సత్యనారాయణ ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీతో రహస్య మంతనాలు జరుపుతారని..అదీకూడా తాను ప్రత్యేకంగా ఢిల్లీ వెళ్లి మరీ జరుపుతారని ఎవరూ అనుకోరు. ఆయన మరీ అంత బహిరంగ రహస్య రాజకీయం చేయరు. అందుకే ఆయన చేసినట్లుగా ప్రచారం మాత్రం చేస్తున్నారని అంటున్నారు.
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ప్రస్తుతం బలమైన వైసీపీ నేత బొత్స మాత్రమే. ఆయనకు కూడా ఎలాంటి స్వేచ్చ ఉండటం లేదు. ప్రెస్మీట్లు పెట్టమన్నప్పుడు పెట్టడం తప్ప చేయడానికి ఏమీ ఉండటం లేదు. అదే సమయంలో.. ఆయన ప్రాధాన్యతను వ్యూహాత్మకంగా వైసీపీ పెద్దలు తగ్గించేస్తున్నారు. అక్కడ మొత్తం విజయసాయిరెడ్డిదే రాజ్యం. దీంతో ఆయన అసంతృప్తిగా ఉన్నారని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో బొత్సను మరింతగా బలహీనం చేసే ప్రక్రియలో… ఈ ప్రచారాన్ని వైసీపీ పెద్దలే చేస్తున్నారని అంటున్నారు. మొత్తానికి వైసీపీ హైకమాండ్‌పై బొత్స కుట్ర చేయడం కన్నా.. బొత్స మీద.. వైసీపీలోనే అంతర్గతంగా కుట్ర జరుగుతోందన్న అభిప్రాయం ఎక్కువ మందిలో వినిపిస్తోంది.