ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ పెద్దగా చదువుకోలేదు కానీ ఆయన విద్యాశాఖ మంత్రి అయ్యారు. ఇప్పుడు ఆయన భార్య ఏకంగా హైకోర్టు లాయర్ అయ్యారు. అమ్మమ్మగా హోదా పొందినప్పటికీ చదువుపై ఉన్న ఆసక్తితో బొత్స ఝాన్సీ లా చదివారు. హైకోర్టు బార్ అసోసియేషన్ సభ్యత్వాన్ని తీసుకున్నారు. ఇప్పటికే రెండు పీహెచ్డీలు పూర్తి చేసినట్లుగాచెబుతున్నారు. లా నుంచి పీహెచ్డీ ఉందని చెబుతున్నారు. అయితే ఆమె ఎప్పుడ బార్లో సభ్యత్వం తీసుకోలేదు. తాజాగా ఆమె బార్ మెంబర్షిప్ పొందడంతో మంత్రి బొత్స ట్వీట్టర్ వేదికగా స్పందించారు.. ఆమెను అభినందించారు.
బొత్స ఝాన్సీ గతంలో ఎంపీగా, జెడ్పీ ఛైర్పర్స్గా కూడా పనిచేశారు. ఇప్పటికీ ఝాన్సీ రాజకీయాల్లోనూ బాగా యాక్టివ్గా ఉన్నారు. ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ సతీమణి, మాజీ ఎంపీ ఝాన్సీ చదువుల్లోనూ రాణిస్తున్నారు. తాజాగా ఏపీ హైకోర్టు న్యాయవాదిగా మారారు. ఎంఏ ఫిలాసఫీ, ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం పూర్తి చేశారు. అనంతరం ఫిలాసఫీ, లాలో రెండు పీహెచ్డీలు పూర్తి చేశారు.
ఇప్పుడు న్యాయవాదిగా ఆంధ్రప్రదేశ్ బార్ అసోసియేషన్ సభ్యత్వం అందుకున్నారు. ఈ సందర్భంగా.. సతీమణి ఝాన్సీని మంత్రి బొత్స సత్యనారాయణ అభినందించారు. న్యాయం కోసం ఎదురు చూసే సామాన్యుని పక్షాన న్యాయ స్థానంలో నిలిచేందుకు ఈరోజు న్యాయవాదిగా ఆంధ్రప్రదేశ్ బార్ అసోసియేషియన్ సభ్యత్వం పొందారు అంటూ అభినందనలు తెలిపారు.