అమరావతి రైతుల్ని ఎంత దారుణంగా తూలనాడాలో వైసీపీ మంత్రులు బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు. పాదయాత్ర ఉత్తరాంధ్రకు దగ్గర పడేకొద్ది.. రెచ్చగొట్టి ఏదో చేయాలనుకుటున్నారు. కాళ్లు విరగ్గొడతాం.. తరిమికొడతాం లాంటి మాటలు అయిపోయాయి.. ఇప్పుడు బొత్స సత్యనారాయణ రంగంలోకి దిగి పాదయాత్ర గా వస్తున్న వారంతా రైతులు కాదు దోపిడి దారులు అనేశారు. దోపిడిదారులంతా పాదయాత్రగా వస్తున్నారని .. అసువుగా అనేశారు. కొద్ది రోజులుగా బొత్స సత్యారాయణ అసహనానికి గురవుతున్నారు. ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. అయితే ఆయన మాటల్ని ప్రజలు పెద్దగా పట్టించుకోవడం లేదు.
ఉత్తరాంధ్ర ప్రజల్ని రెచ్చగొట్టడంలో విఫలమవుతున్నారని పై నుంచి ఒత్తిళ్లు వస్తున్నాయేమో కానీ మంత్రులు బొత్స , గుడివాడ అమర్నాథ్ తమ రాజకీయ తెలివితేటలన్నీ ప్రదర్శించి వివాదాస్పద కామెంట్లు చేస్తున్నారు. మేధావులతో సమావేశాలని హడావుడి చేస్తున్నారు. కానీ పెద్దగా పట్టించుకుటున్న వారు. విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా ప్రకటించిన మొదట్లో కాస్త స్పందన ఉండేది కానీ.. ఇప్పుడు కబ్జాలు.. ఇతర దారుణాలు పెరిగిపోతూండంతో ప్రజల్లోనూ వైసీపీ తెచ్చే రాజధానిపై వ్యతిరేకత కనిపిస్తోంది.
అయితే ప్రజలందర్నీ ఉద్రేకపరచాలనుకుంటున్నారు కానీ ప్రయోజనం ఉండటం లేదు. ఉత్తరాంధ్ర దగ్గరకు వచ్చే సరికి..ఏదో ఒకటి చేయాలన్న తాపత్రయంలో ఉన్నారు. పార్టీ పరంగా ఏమైనా చేస్తే ప్రజల్లో చెడ్డ పేరు వస్తుందని అక్కడి నేతలు భావిస్తున్నారు. కానీ వారిపై ఉన్న ఒత్తి అంతా ఇంతా కాదని తెలుస్తోంది. మరి ఈ విషయంలో బొత్స, అమర్నాథ్లు ఎలా తట్టకుంటారో కానీ వారు మాత్రం అగ్నిపరీక్ష ఎదుర్కొంటున్నారని వైసీపీలోనే జాలి చూపిస్తున్నారు.