వైసీపీ నేతలు చిత్రవిచిత్రమైన రాజకీయాలు చేస్తూంటారు. వారు చేసే రాజకీయాలు ఏమీ తెలియని వారికి సీరియస్ గా ఉంటాయి. కానీ ఏదో అసలు విషయం తెలిసిన వారికి మాత్రం ఇంత అమాయకులా లేకపోతే జనాల్ని పిచ్చి వాళ్లను చేయాలనుకుంటున్నారా అన్న ప్రశ్నలు వారికి వేరే వేసుకుంటారు. అలాంటి వారిలో బొత్స సత్యనారాయణ ఒకరు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన.. తమ పార్టీకి దూరంగా ఉంటున్న ఎమ్మెల్సీలపై అనర్హతా వేటు వేయాలని డిమాండ్ చేశారు. కొంత మంది ఎమ్మెల్సీలపై ఆయన అసహనం వ్యక్తం చేశారు.
బొొత్స మండలి వైసీపీ పక్ష నేత. అంటే ప్రతిపక్ష నేత హోదా అధికారికంగా ఉంది. ఆయన మాటలను ఎమ్మెల్సీలు వినలేదో లేకపోతే మరో కారణమో కానీ ఈ అసంతృప్తి వ్యక్తంచేశారు. ఈ కోపంలో ఆయన మర్చిపోయినట్లుగా ఉన్నారు కానీ మండలి చైర్మన్ వైసీపీ నాయకుడే. ఆయన ఎన్నికలకు ముందు చాలామందిపై అనర్హతా వేటు వేశారు. సంజాయిషీ కూడా తీసుకోకుండా అనర్హతా వేటు వేస్తే కోర్టు కూడా ఓ ఎమ్మెల్సీకి ఊరట కల్పించింది. అంతకు మించి పలువురు ఎమ్మెల్సీలు రాజీనామాలు చేసి ఉన్నారు. వారి రాజీనామాలను కూడా ఆమోదించడం లేదు.
మా రాజీనామాలు ఆమోదించాలని ఎమ్మెల్సీలు శాసనమండలిలో ప్లకార్డులు కూడా ప్రదర్శించారు. అయినా ఆమోదించకుండా బొత్స బయట అనర్హతా వేటు వేయాలని డిమాండ్ చేస్తున్నారు. బొత్స రాజకీయం చూసి వైసీపీ నేతలు కూడా మా బొత్స చాలా సీనియర్ అని గొప్ప చెప్పుకుంటూ ఉంటారేమో ?