ఉగాది నాటికి టీడీపీ ఉండదని చంద్రబాబు అరెస్టు సమయంలో సీనియర్ మంత్రి బొత్స వ్యాఖ్యలు చేశారు. కట్ చేస్తే ఎన్నికల తర్వాత వైసీపీ ఉనికి ప్రశ్నార్థకమయింది. అంతే నా బొత్స కూడా కనుమరుగైపోయారు. ఆయన కుటుంబం ఇక రాజకీయంగా కోలుకునే అవకాశాలు కనిపించడంలేదు.
విజయనగరం జిల్లాలో బొత్స కుటుంబం పరపతి జీరోగా మారింది. ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మెల్లగా కింది స్థాయి నుంచి పై స్థాయి వరకూ పట్టు పెంచుకుంటూ వచ్చారు. విజయనగరం జిల్లాను గుప్పిట పట్టారు. కానీ ఇప్పుడు మొత్తం సర్వం కోల్పోయారు. స్వయంగా తాను కూడా ఓడిపోయారు. రాజకీయంగా తమ కుటుంబాన్ని ఎవరూ పట్టించుకోని పరిస్థితికి తీసుకెళ్లిపోయారు.
బొత్స సత్యనారాయణ చీపురుపల్లిలో ఓడిపోయారు. ఓడిపోతారని అనేక సంకేతాలు వచ్చినా… ఎలా ఓడిపోతామన్నట్లుగా లైట్ తీసుకున్నారు. ఎవరూ లేక విశాఖ ఎంపీ టిక్కెట్ ఆయన భార్యకు ఇస్తే.. అది ట్రాప్ అని తెలుసుకోలేక భార్యను నిలబెట్టి ఐదు లక్షల ఓట్ల తేడాతో పరాజయం కొని తెచ్చుకున్నారు. గజపతి నగరంలో ఆయన సోదరుడు.. ఎస్ కోటలో ఆయన సమీప బంధువు కూడా దారుణ పరాజయం పాలయ్యారు. విజయనగరంలో మిగిలిన చోట్ల నిలబెట్టిన వారు కూడా తన అనుచరులే. అందరూ పరాజయం పాలయ్యారు.
కొన్ని సీట్లు గెలిచినా గెలిచే పార్టీలోకి జంప్ అవ్వాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ విషయం తెలిసి జగన్ ఆయనను .. మీడియా ముందు వివాదాస్పద వ్యాఖ్యలు చేసేలా ప్రోత్సహించారు. చివరికిఆయన రాజకీయ జీవితానికి ఎండ్ కార్డ్ పడిపోయింది.