మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా వైసీపీ ఎంపిక చేసింది. పార్టీ అధినేత జగన్ తో ఈ విషయమై చర్చించిన అనంతరం బొత్స పేరును వైసీపీ అధికారికంగా ప్రకటించింది.
విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాకు చెందిన పార్టీ నేతలతో జగన్ వరుసగా సమావేశమయ్యారు. అభ్యర్థి ఎంపికపై అభిప్రాయ సేకరణ చేపట్టిన అనంతరం బొత్సను పార్టీ అభ్యర్థిగా ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
Also Read : లక్ష్మీపార్వతికి కూటమి సర్కార్ షాక్
మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాభవంతో ఈ ఎమ్మెల్సీ ఎన్నికలను వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాగైనా నెగ్గి , పరువు కాపాడుకోవాలని సీనియర్ నేత అయిన బొత్స అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది.
ఉత్తరాంధ్రకు చెందిన సీనియర్ నేత కావడంతో బొత్సకు విశాఖకు చెందిన పార్టీ ప్రజా ప్రతినిధులతో సంబంధాలు ఉన్నాయి. ఇది తమకు కలిసి వస్తుందని భావించి ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్సకు అవకాశం ఇచ్చినట్లుగా తెలుస్తోంది.