విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణను జగన్ ఖరారు చేశారు. దీంతో పాపం బొత్స అని జాలి చూపిస్తున్నారు ఇతర నేతలు. అసలు పోటీ చేయడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో జగన్ బొత్సను ముందుకు తోశారు. తన వల్ల కాదని చెప్పడానికి సీనియార్టీ అడ్డు రావడంతో మౌనంగా బయటకు వచ్చేశారు.
ఇటీవలి ఎన్నికల్లో బొత్స కుటుంబానికి విశాఖ ఎంపీ టిక్కెట్ కూడా అడగకుండానే ఇచ్చారు జగన్. అసలు చాన్సే లేని చోట చాలా అవకాశాలు ఉన్నాయని చెప్పి విపరీతంగా ఖర్చు పెట్టించారు. చివరికి అత్యంత ఘోరంగా ఐదు లక్షల ఓట్ల తేడాతో ఆయన భార్య పరాజయం పాలయ్యారు. ఆమె ఒక్కరే కాదు.. మొత్తం బొత్స కుటుంబంలో ఒక్కరు కూడా గెలవలేదు. చివరికి బొత్స కూడా ఓడిపోయారు. ఇప్పుడు మరోసారి విశాఖ స్థానిక సంస్థల ఎన్నికల బరిలో నిలబడుతున్నారు.
Also Read : బొత్సా.. ఇంకా ఇదేం రచ్చ!
అధికారికంగా వైసీపీకి 750, టీడీపీకి 250 వరకూ ఓట్లు ఉన్నాయి. ఈ ఓట్ల లెక్కల ప్రకారం చూస్తే వైసీపీ గెలుపు నల్లేరుపై నడక. కానీ ఎన్నికల సమయంలోనే చాలా మంది వైసీపీ ఓటర్లు పార్టీ మారారు. ఎన్నికల ఫలితాలు వచ్చాక మరింత మంది పార్టీ మారారు. ఎంత మందిని క్యాంపునకు తీసుకెళ్లినా చివరికి వైసీపీకి ఓటేస్తారన్నది కూడా డౌటే. ఎవరి సమస్యలు వారికి ఉంటాయి. టీడీపీ బెదిరిస్తుందని.. ఓటర్లను కాపాడుకోవాలని జగన్ చెప్పి పంపించారు.
టీడీపీ తరపున గండి బాబ్జిని ఎమ్మెల్సీగా నిలబెట్టే అవకాశం ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని మెజార్టీలు సాధించడంతో.. స్థానిక సంస్థల ఎన్నికల్లో సునాయాసంగా గెలుస్తామని వైసీపీపై వారి క్యాడర్ కు నమ్మకం లేదని టీడీపీ నేతలంటున్నారు. భారీగా ఓట్లు ఉన్నా బొత్స ఓడిపోతే.. ఆయన రాజకీయ జీవితం ఘోరమైన ముగింపునకు వస్తుందని… జగన్ అదే కోరుకుంటున్నారన్న సెటైర్లు వినిపిస్తున్నాయి.