ఆంధ్రప్రదేశ్ ని ఆరు ప్రాంతాలుగా విభజించి వాటికి వైసీపీ తరపున ఆరుగురు కోఆర్డినేటర్లను జగన్ ప్రకటించారు . అందులో తమ సామాజికవర్గానికి న్యాయం చేసుకున్నారు. ఐదుగురు రెడ్లను.. ఒక్క బొత్సకు చాన్స్ ఇచ్చారు. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం జిల్లాలకు ఎంపీ మిథున్ రెడ్డిని నియమించారు. ఈయన గతంలో గోదావరి జిల్లాలకు ఇంచార్జ్ గా ఉండి గత్తర గత్తర చేయడంతో ఒక్క సీటు కూడా రాలేదు. అందుకే ఆ జిల్లాల నుంచి తప్పించి గుంటూరు, ప్రకాశం జిల్లాలను ఇచ్చారు.
ఇక ఆయన తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఉమ్మడి చిత్తూరు, నెల్లూరు జిల్లాలను ఇచ్చారు. గత ఎన్నికల్లో అనంతపురం జిల్లాను డబ్బుతో కొట్టేద్దామనుకుని బొక్క బోర్లా పడ్డారు. మళ్లీ ఆయనకు అనంతపురం చాన్సివ్వలేదు. ఇక గుంటూరులో దున్నేసిన రాంకీ ఓనర్ అయోధ్యరామిరెడ్డికి ఈ సారి ఉమ్మడి కృష్ణా జిల్లా ఒక్కటే ఇచ్చారు. జగన్ రెడ్డి బాబాయ్ వైవీ సుబ్బారెడ్డికి కడప, అనంతపురం, కర్నూల్ జిల్లాలను రాసిచ్చారు. గతంలో ఈయనకు ఉత్తరాంధ్రలో పవర్ చ్చారు.
విచిత్రం ఏమిటంటే… విజయసాయిరెడ్డికి కూడా మళ్లీ చాన్స్ ఇచ్చారు. విజయసాయిరెడ్డి దందాలు చేసి ఉత్తరాంధ్రలో ముంచేశాడని పేరుంది. అయినా మళ్లీ ఆయనకు ఉమ్మడి విశాఖ, శ్రీకాకుళం జిల్లాలు రాసిచ్చారు. అంటే విజయసాయిరెడ్డి సైలెంట్ బ్లాక్ మెయిల్ ద్వారా తాను అనుకున్నది సాధించారన్నమాట. ఈ ఐదుగురు రెడ్ల మధ్య బొత్స ఒక్కడికి మాత్రం ఉభయగోదావరి జిల్లాలు కేటాయించారు. అక్కడ ఆయనేం చేస్తారో కూడా ఇప్పుడు విశాఖలోనూ ఆయన వేలు పెట్టలేని పరిస్థితి ఏర్పడుతుంది.