ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం…రాజధానిపై స్పెక్యులేషన్‌ను పెంచేందుకు ఒకలా.. తగ్గించేందుకు మరోలా.. వ్యాఖ్యలు చేస్తూ… గందరగోళానికి గురి చేస్తోంది. అమరావతి విషయంలో ప్రభుత్వం చర్చ జరుగుతోందని.. నిర్మోహమాటంగా ప్రకటించిన బొత్స సత్యనారాయణ .. ఆ తర్వాత చేసిన వివాదాస్పద ప్రకటనలకు అంతే లేదు. తాజాగా.. వైసీపీ చాయిస్‌గా ప్రచారంలో ఉన్న దొనకొండపై… మంత్రి బొత్స సత్యనారాయణ.. అలాంటి వివాదాస్పద వ్యాఖ్యలే చేశారు. రాజధానిని దొనకొండకు మారుస్తారా.. అంటూ.. మీడియా నుంచి ఎదురైన ప్రశ్నలకు.. ఆయన ” దొనకొండా.. అదెక్కడుంది..?” అంటూ.. వెటకారపు సమాధానం చెప్పారు. దీంతో ఆశ్చర్యపోవడం మీడియా ప్రతినిధుల వంతు అయింది.
అమరావతిపై.. లేనిపోని అనుమానాల్ని రేకెత్తించింది.. చివరికి గెజిట్ ప్రకటించలేదు కాబట్టి.. తాత్కాలిక రాజధానినే అనేసిన.. బొత్స సత్యనారాయణ… అమరావతి విషయంలో తన వాదనను సమర్థించుకోవడానికి.. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇప్పటికీ.. కచ్చితంగా అమరావతిలోనే రాజధాని ఉంటుందని.. నేరుగా ఒక్క మాట కూడా.. ప్రభుత్వం నుంచి స్పష్టంగా రాలేదు. కానీ… అమరావతి ఎక్కడికి పోతుంది..?. రాజధాని మారుస్తారమని ఎవరు చెప్పారు..? ముఖ్యమంత్రి ఏమీ చెప్పకుండానే ఎందుకు ప్రచారం చేస్తారు..? అంటూ… విభిన్నమైన ప్రశ్నలతో ఎదురుదాడి చేస్తున్నారు కానీ… అందరూ డిమాండ్ చేస్తున్నట్లుగా.. సీఎం .. అమరావతిలోనే రాజధాని ఉంటుందని.. జగన్ ఎందుకు ప్రకటించడం లేదనేదే చాలా మందికి అర్థం కాని విషయం.
బొత్స సత్యనారాయణ.. దొనకొండకు రాజధాని తరలింపుపై సెటైర్లు వేసినా… దొనకొండను కించ పరిచేలా మాట్లాడినా.. వైసీపీ ప్రభుత్వ వ్యవహరిస్తున్న తీరుతో.. స్పెక్యులేషన్ తగ్గే అవకాశం లేదు. వైసీపీ నేతలు ఇప్పటికే పెద్ద ఎత్తున అమరావతిలో భూములు కొనుగోలు చేస్తున్నారని.. అక్కడ భూముల రేట్లు అమాంతం పెరిగిపోయాయని… చెబుతున్నారు. ఈ క్రమంలో బొత్స… అసలు దొనకొడ ఎక్కడో కూడా తెలియదన్నట్లుగా వ్యవహరించడం… మాట్లాడటం… చర్చనీయాంశం అవుతోంది.