శాసనమండలి చైర్మన్ వంటి వ్యవస్థలపైనే చర్చ జరగాల్సి ఉందని.. మంత్రి బొత్స సత్యనారాయణ అసహనం వ్యక్తం చేశారు. ఓ వైపు అసెంబ్లీ స్పీకర్.. స్పీకర్ పదవిలో ఉంటూ.. ఏమేం చేయకూడదో.. అన్నీ చేస్తున్నా.. ఇప్పటి వరకూ.. ఆయనకు అది తప్పుగా అనిపించలేదు కానీ.. తాము ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన బిల్లును సెలక్ట్ కమిటీకి .. మండలి చైర్మన్ షరీఫ్ పంపడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. ఉన్నత పదవులపై తాబేదార్లను కూర్చోబెట్టే వ్యవస్థలపై చర్చ జరగాలని ప్రకటించారు. ఇలాంటి వ్యవస్థ ఉండాలా అనే విషయంపై చర్చ జరుగుతోందన్నారు.
నిబంధనలు పాటించాలని సగం మందికి పైగా సభ్యులు చెబుతున్నా.. మండలి చైర్మన్ పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నత పదవులపై తాబేదార్లను కూర్చోబెట్టే వ్యవస్థలపై చర్చ జరగాలని… ఇలాంటి వ్యక్తులు, వ్యవస్థలు అవసరమా అని బొత్స ఆవేశ పడిపోయారు. శాసనమండలిని రద్దు చేయాలంటే.. ఏం చేయాలన్నదానిపై జగన్మోహన్ రెడ్డి నిపుణులతో సంప్రదిస్తున్నట్లుగా బొత్స మాటలను బట్టి అర్థమైపోతోంది. కానీ.. ఎలా చూసినా.. పార్లమెంట్ ఉభయసభలు ఆమోదించాల్సి ఉంటుందని.. అప్పటి వరకూ మండలి ఉనికిలోనే ఉంటుందని.. అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
దాని కన్నా.. ప్రతిపక్ష ఎమ్మెల్సీలను పార్టీలోకి లాగేసుకోవడమో.. లేదా.. మరో ఏడాది.. ఏడాదిన్నరకు… తమకు మెజార్టీ వచ్చే వరకూ ఎదురు చూడటమో చేయాలి. అయితే జగన్ మాత్రం.. ఇప్పటికిప్పుడు రద్దు చేయాలంటే.. ఏం చేయాలన్నదానిపై సూచనలు అడుగుతున్నట్లుగా చెబుతున్నారు.