బైజూస్ కాంట్రాక్టు వివరాలు బయట పెట్టాలని… నాలుగేళ్లలో ఒక్క టీచర్నీ ఎందుకు నియమిచలేదని పవన్ కల్యాణ్ వేసిన ప్రశ్నలకు మంత్రి బొత్స సత్యనారాయణ ఇంగ్లిష్ లో కౌంటర్ ఇచ్చారు. అయితే ఇక్కడ కగారు పడాల్సిన పని లేదు… ఆయన మీడియాతో ఇంగ్లిష్ లో కౌంటర్ ఇవ్వలేదు. ట్విట్టర్ ద్వారా మాత్రమే ఇంగ్లిష్ లో కౌంటర్ ఇచ్చారు. పవన్ చేసిన ఆరోపణలకు సమాధానం ఇస్తే పర్వాలే దు కానీ ట్యూషన్లు చెబుతా.. హోం వర్క్ చేయాలి అంటూ అతి చేయడం వైరల్ గా మారుతోంది. అదీ కూడా బొత్స గారి చదువు.. ఆయన ఇంగ్లిష్ గురించి అందరికీ తెలిసి కూడా.
ఇంతా చేసి బైజూస్ కాంట్రాక్ట్ గురించి పవన్ అడిగిన వివరాలు చెప్పారా అంటే చెప్పలేదు.. జ్యూడియియల్ రివ్యూ వెబ్ సైట్ అడ్రస్ ఇచ్చి అందులో ఉంటుంది చూసుకోండి అని సలహా ఇచ్చేశారు. అందులో ఏమీ లేకపోతే.. నేరుగా ఆ వివరాలే ప్రకటించవచ్చు కదా అని అందరికీ వచ్చే డౌట్. అసలు బైజూస్ కు కాంట్రాక్ట్ ఎలా ఇచ్చారన్నదానిపై ఉన్న సందేహాలకు సమాధానమే చెప్పలేదు. కానీ ప్రపంచంలోనే తమదే జ్యూడిషియల్ రివ్యూపెట్టిన ప్రభుత్వం అని చెప్పుకొచ్చారు. కాంట్రాక్టులు ఎలా ఇస్తున్నారో కళ్ల ముందే అందరికీ కనిపిస్తోంది కదా అని మాత్రం ఎవరికీ తెలియదని కళ్లు మూసుకుంటున్నారు.
అయితే ఈ ట్వీట్ బొత్స చేసింది కాదని.. ఐ ప్యాక్ చేసిందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కానీ బొత్స గురించి..ఆయన ఎడ్యుకేషన్.. స్థాయి గురించి తెలుసుకున్న తర్వాత స్థాయిలో ట్వీట్ పెడితే నలుగురు నమ్మేలా ఉండేది. కానీ అలాంటి దేమీ చూసుకోకుండా హై రేంజ్లో ఆయనపై ట్వీట్ పెట్టడంతో… ట్రోలింగ్ కు గురయ్యే పరిస్థితి ఏర్పడింది.