ప్రేమించడం తప్పేం లేదు కానీ.. ప్రేమ పేరుతో మోసం చేయడం మాత్రం తప్పే్. ఇది మనసును హర్ట్ చేస్తుంది. దారుణమైన నిర్ణయాలు తీసుకునేలా ప్రేరేపిస్తుంది. ఇలా ఓ యువకుడు..తన లవర్ మోసం చేసిందని ఏకంగా ప్రాణాలు తీసుకున్నాడు. విజయవాడలో ఈ ఘటన జరిగింది.
విజయవాడలో అబ్దుల్ సలామ్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. విజయవాడకు చెందిన బీటెక్ విద్యార్థి అబ్దుల్ సలామ్ సూసైడ్ నోట్ రాసి రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సుకుమిక అనే యువతి తనను ప్రేమ పేరుతో మోసం చేసిందని సూసైడ్ నోట్ లో సలామ్ రాశాడు. చనిపోతూ సూసైడ్ లెటర్ రాశాడు. ఓ యువతి ప్రేమించి వంచిందని వాపోయాడు. తనను ప్రేమించిన యువతి ప్రవర్తనలో కొంతకాలంగా మార్పు వచ్చిందని తీరా ఆరా తీస్తే పెళ్లైన వ్యక్తితో న్యూడ్ వీడియో కాల్స్ చేస్తూ రిలేషన్ లో ఉందని తెలిసిందన్నాడు. ఈ విషయాన్ని జీర్ణించుకోలేక ఆత్మహత్య చేసుకుంటానని సలామ్ లేఖలో రాసుకున్నాడు.
ఆ యువతి ప్రవర్తన మారుతుందని ఎంత ప్రయత్నించినా మారడంలేదని, దీంతో తాను సరిగా చదవలేకపోతున్నానని రాశాడు. అన్నీ వదిలేయమని చెప్పినా వినకుండా అర్థరాత్రుళ్లు మరో వ్యక్తితో వీడియో కాల్స్ మాట్లాడుతుందని సలామ్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ టైమ్ పాస్ ప్రేమతో తనను పిచ్చివాడ్ని చేసిందన్నాడు. అందుకు ఈ నిర్ణయం తీసుకున్నానని సలామ్ లెటర్ లో రాశాడు.
యువతి టైమ్ పాస్ ప్రేమతో తాను పిచ్చోడిని అయ్యానని, జీవితం మీద విరక్తితో తన తల్లిదండ్రులకు సమాధానం చెప్పలేక ఈ నిర్ణయం తీసుకున్నానని వాపోయాడు. తనపై ఫేక్ ప్రేమ నటించిందని, పెళ్లైన ఓ లెక్చరర్‌తో సంబంధం పెట్టుకుని న్యూడ్ వీడియో కాల్స్ మాట్లాడేదని తెలిపారు. అబ్బాయిలు మోసం చేసే హైలైట్ చేస్తారు కానీ అమ్మాయిలు మోసం చేస్తే ఎందుకు ప్రశ్నించరని సలామ్ లేఖలో రాశాడు. మోసపోయిన తనలాంటి అమాయకపు అబ్బాయిలకు న్యాయం చేయాలంటూ సలామ్ లేఖలో కోరారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.