మనకున్న మాస్, కమర్షియల్ దర్శకుల్లో బోయపాటి శ్రీను ఒకడు. పట్టాడండే సినిమా హిట్టే. దమ్ము ఒక్కటి మినహాయిస్తే.. మిగిలిన సినిమాలన్నీ కమర్షియల్గా బాగా ఆడాయి. ఇప్పుడు సరైనోడు కీ మంచి క్రేజ్ ఉంది. అయితే.. బోయపాటి శ్రీను మాత్రం… ”నేను చేసేది మహా అయితే పది సినిమాలంతే.. ”అంటూ వేదాంత ధోరణిలో మాట్లాడుతున్నాడు. దానికి కారణం ఉంది. ”చేతిలో మూడు నాలుగు సినిమాలు పెట్టుకోవడం నాకు ఎప్పుడూ ఇష్టం ఉండదు. సినిమా తరవాత సినిమా చేస్తా. అదీ టైమ్ తీసుకొంటా. అందుకే నేను ఇన్నేళ్ల కెరీర్లో చాలా తక్కువ సినిమాలు చేశా. నా కెరీర్లో మహా అయితే మరో పది సినిమాలు చేస్తానేమో? తక్కువ సినిమాలు చేసినా ఫర్వాలేదు. కానీ మంచి సినిమాలే ఇవ్వాలి. ఎందుకంటే మనం రేపు ఉండొచ్చు ఉండకపోవొచ్చు. కానీ మన సినిమా ఉంటుంది. అది చరిత్ర.. దాన్ని కాపాడుకోవాలి” అంటున్నాడు బోయపాటి.
అంటే బోయపాటి ఇలా నెమ్మదిగానే సినిమాలు తీస్తాడన్నమాట. తను చెప్పిందీ నిజమే ఇలా యేడాదికో సినిమా చేసుకొంటూ పోతే. పదికి మించి ఇంకేం చేయగలడు? ఆ తరవాత రిటైర్మెంటే ఇక.