బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్లో హ్యాట్రిక్ హిట్లు వచ్చాయి. సింహా, లెజెండ్, అఖండ.. ఒకదాన్ని మించి మరోటి విజయాల్ని అందుకొన్నాయి. ఇప్పుడు డబుల్ హ్యాట్రిక్‌కి రంగం సిద్ధం అవుతోంది. బాలయ్య – బోయపాటి మళ్లీ కలిసి పనిచేయబోతున్నారు. అనిల్ రావిపూడి తరవాత.. బాలయ్య పట్టాలెక్కించే సినిమా ఇదే. జులై మొదటి వారంలో ఈసినిమాని అధికారికంగా ప్రారంభిస్తారని సమాచారం.
అఖండ 2 గా.. ఈ సినిమా ఉండబోతోందని వార్తలు ఇది వరకే వచ్చాయి. అఖండ క్లైమాక్స్ లో సీక్వెల్ కి బీజం వేశాడు బోయపాటి. దాంతో.. అంతా ఇది అఖండ 2 అనే అనుకొన్నారు. కానీ ఇది అఖండ 2 కాదట. లెజెండ్ కి సీక్వెల్ గా ఈ కథ ఉండబోతోందట. లెజెండ్ లో రాజకీయ పరమైన అంశాలు చాలా ఉంటాయి. క్లైమాక్స్ లో ఎం.ఎల్.ఏ లను పిలిపించి.. క్లాస్ పీకే సీన్ ఒకటుంది. ఆ సీన్లో డైలాగులు బాగా పేలాయి. అందులో పొలిటికల్ సెటైర్లు బాగా పడ్డాయి. ఆ సీన్ నుంచే.. ఇప్పుడు కొత్త కథ ప్రారంభం కానుందట. 2024 ఎన్నికల ముందు ఈ సినిమాని విడుదల చేయాలన్నది ప్లాన్. అలాగైతే.. పొలిటికల్ మైలేజీకి కలిసొస్తుందని బాలయ్య భావిస్తున్నాడు.