బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖిల్ కథానాయకుడిగా ఓ చిత్రం తెరకెక్కనున్నదని ఈమధ్య వార్తలు బాగా పుట్టుకొచ్చాయి. దానికి రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తాడని కూడా చెప్పుకున్నారు. అఖిల్ తొలి సినిమా సమయంలో… దర్శకుడిగా బోయపాటి శ్రీను పేరు గట్టిగా పరిశీలించారు. నాగ్ తో పలుదఫాలుగా బోయపాటి చర్చలు కూడా జరిపాడు. కానీ.. ఆ ఛాన్స్ వినాయక్ కి వెళ్లిపోయింది. అప్పటి నుంచీ.. అఖిల్ – బోయపాటి సినిమా గురించిన వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా.. ఈ వార్తకు మరింత పాపులారిటీ వచ్చింది. దానికి గల కారణం.. ఈ చిత్రానికి చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడని తెలియడమే.
దీనిపై బోయపాటి శ్రీను స్పందించారు. తెలుగు 360తో ఆయన మాట్లాడుతూ.. ”అఖిల్‌తో సినిమా అనే వార్తలో నిజం లేదు. ప్రస్తుతం చరణ్ సినిమాపైనే ఫోకస్ పెట్టా. ఆ తరవాత నందమూరి బాలకృష్ణతో సినిమా ఉంటుంది. ఆ తరవాత ఏం చేయాలన్నది ఇంకా నిర్ణయించుకోలేదు. ఏదైనా కథని బట్టే” అని క్లారిటీ ఇచ్చేశారు. బాలయ్యతో సినిమా అంటే మరో యేడాది వరకూ బోయపాటి దొరకడు. ఈలోగా… ఎన్ని సమీకరణాలు మారతాయో..??