డిమాండ్ సప్లై.. ఈ ఎకనామిక్స్ సూత్రం చిత్రసీమని చాలా బాగా అర్థం చేసుకొంది. డిమాండ్‌ని బట్టే… పారితోషికం గుంజుళ్లుంటాయ్ ఇక్కడ. హీరోని బట్టి, చిత్ర నిర్మాణ సంస్థని బట్టి, ప్రస్తుతం ఉన్న ఫామ్‌ని బట్టి పారితోషికాల్లో మార్పులూ వస్తుంటాయ్. తాజాగా బోయపాటి శ్రీను అందుకొన్న పారితోషికమే దీనికి అతి పెద్ద ఉదాహరణ. దమ్ము సినిమా ఫ్లాఫ్ అవ్వడంతో.. బోయపాటికి లెజెండ్ ద్వారా రూ.5 కోట్లు మాత్రమే పారితోషికం అందుకొన్నాడు. ఆ సినిమా హిట్టవ్వడంతో.. బోయపాటి రేంజు పెరిగింది. అయితే గీతా ఆర్ట్స్ మాత్రం సరైనోడు కోసం బోయపాటికి రూ.6 కోట్ల పారితోషికం ముట్టజెప్పినట్టు తెలుస్తోంది. హీరో బన్నీ కావడంతో, ఈ సినిమా హిట్టయితే తన మైలేజీ మరో స్థాయిలో ఉంటుందని ఊహించిన బోయపాటి.. రూ.6 కోట్లకు ఓకే అనేశాడు.
అదే సమయంలో బెల్లంకొండ శ్రీనివాస్‌తో సినిమా చేస్తానని బోయపాటి మాటిచ్చాడు. అడ్వాన్సూ అందుకొన్నాడు. అయితే ఆ సినిమా కోసం బోయపాటి అందుకొన్న పారితోషికం అక్షరాలా రూ.12 కోట్లు. అంత పారితోషికం ఇస్తున్నారు కాబట్టే కొత్త కుర్రాడైనా సరే.. శ్రీనివాస్ తో సినిమా చేయడానికి ఒప్పుకొన్నాడు. అందులో రూ.5 కోట్లు ఇప్పటికే అడ్వాన్సు రూపంలో బోయపాటికి అందేశాయి. అందుకే.. కేవలం పారితోషికం కోసం.. శ్రీనివాస్‌తో సినిమా చేయడానికి బోయపాటి ఒప్పుకొన్నాడు. అదీ.. బెల్లంకొండ సినిమా మేటరు!