రామ్‌చరణ్ – బోయపాటి శ్రీను కాంబినేషన్లో ఓ చిత్రం రూపుదిద్దుకుంటోంది. `వినయ విధేయ రామా` అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. దాదాపుగా ఈ పేరునే ఖాయంచ ఏసే అవకాశాలున్నాయి. దీపావళికి ఫస్ట్ లుక్‌ని విడుదల చేసే పనిలో ఉంది చిత్రబృందం. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. దేవి ఆల్బమ్ అంటే ఐటెమ్ గీతం ఉండాల్సిందే. బోయపాటికీ ఐటెమ్ గీతాలపై మక్కువ ఎక్కువే. `సరైనోడు`లో బ్లాకు బ్లస్టరు.. బ్లాకు బ్లస్టరే.. పాట ఆసినిమాకి మరింత మైలేజీ తీసుకొచ్చింది. అందుకే… `వినయ విధేయ రామా`లోనూ ఓ ఐటెమ్ సాంగ్‌కి చోటిచ్చాడు బోయపాటి. ఇప్పటికే దేవి కూడా ట్యూను రెడీ చేసేశాడట. క్యాచీ, ట్రెండీ పదాలతో ఈ పాటని రాయిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ పాట కోసం బాలీవుడ్ కథానాయికని దిగుమతి చేయాలని భావిస్తున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నాయికలెవరు? వాళ్లకు ఏ రేంజులో పారితోషికం ఇవ్వాలి అనేదానిపై డిస్కర్షన్స్ నడుస్తున్నాయి. జనవరిలో విడుదల కాబట్టి.. ఐటెమ్ గాళ్‌ని వెదకడానికి కావల్సినంత సమయం ఉంది. ఈలోగా.. ఎవరిపై కర్చీఫ్ వేస్తారో చూడాలి. అన్నదమ్ముల నేపథ్యంలో సాగే కథ ఇది. ఆర్యన్ రాజేష్, ప్రశాంత్ చరణ్ అన్నయ్యలుగా కనిపిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 11న ఈ చిత్రాన్ని విడుదల చేస్తారు.