మోక్షజ్ఞ ఎంట్రీ గురించి చాలా రోజుల నుంచీ చర్చ జరుగుతోంది. ‘ఎన్టీఆర్’ బయోపిక్‌లోనే మోక్షజ్ఞ కనిపిస్తాడని ప్రచారం జరిగినా…. అది కూడా సాధ్యం కాలేదు. 2019లోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఉండబోతోందని బాలయ్య చాలా సార్లు చెప్పాడు. ఆ చిత్రానికి దర్శకుడు ఎవరన్నది ఆసక్తిని రేపుతోంది. బాలయ్యకు అత్యంత ఇష్టమైన దర్శకులలో బోయపాటి శ్రీను ఒకరు. వారిద్దరి కాంబినేషన్లో మూడో సినిమా త్వరలోనే పట్టాలెక్కబోతోంది. ఆ తరవాత మోక్షజ్ఞ సినిమా ఉంటుందని చెప్పుకుంటున్నారు. వీటిపై బోయపాటి క్లారిటీ ఇచ్చేశాడు.
”మోక్షజ్ఞ డెబ్యూ సినిమా నాతో కాదు. తొలి సినిమానే నాతో చేయడం కరెక్ట్ కాదు. మా ఇద్దరి సినిమా అంటే అభిమానులు అంచనాలు పెంచుకుంటారు. రెండు మూడు సినమాలు చేసిన తరవాతైతే.. బాగుంటుంద”` అని చెప్పేశాడు బోయపాటి. చిరు సినిమాపై కూడా బోయపాటి స్పందించాడు. ”చిరంజీవి ప్రస్తుతం రెండు సినిమాల్ని ఒప్పుకున్నారు. అవి పూర్తయ్యాకే నా సినిమా ఉంటుంది. లైన్‌గా ఓ కథ ఉంది. దాన్ని స్క్రిప్టు రూపంలో తీసుకురావాల”న్నాడు బోయపాటి.