దర్శకుడు బోయపాటి శ్రీను ప్రస్తుతం స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ తో ‘సరయినోడు’ అనే సినిమా తీస్తున్నారు. మరొక రెండు నెలలో దాని షూటింగ్ పూర్తి చేసి వేసవిలో విడుదల చేయాలని భావిస్తున్నారు. తాజా సమాచారం సమాచారం ఏమిటంటే ఆయన ‘అల్లుడు శ్రీను’ సినిమాతో హీరోగా పరిచయమయిన బెల్లంకొండ శ్రీనివాస్ తో తన తరువాత సినిమా చేయబోతున్నారు. ప్రస్తుతం అతను భీమనేని శ్రీనివాస్ దర్శకత్వంలో ‘స్పీడున్నోడు’ అనే సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావస్తోంది. బహుశః వచ్చే నెలలో విడుదలయ్యే అవకాశం ఉంది. అది పూర్తయిన తరువాత బోయపాటి దర్శకత్వంలో సినిమా షూటింగ్ మొదలవుతుంది. బహుశః వారి కొత్త సినిమా ఏప్రిల్ లేదా మే నెలలో మొదలవవచ్చునని తెలుస్తోంది. ఈ సినిమాని కొత్తగా సినీ నిర్మాణ రంగంలో ప్రవేశిస్తున్న అభిషేక్ పిక్చర్స్ తన స్వంత బ్యానర్లో నిర్మించబోతోంది.