టాలీవుడ్ క్రేజీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ అంటే అభిమానం చూపించే వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నా సరే సెట్స్ లో ఏమాత్రం కోపం చిరాకు కనబడవట రకుల్ మొహం మీద. అయితే ఇదే ఆమెను అందరు మెచ్చేలా చేస్తుంది. ఇక ఈరోజు రిలీజ్ అవుతున్న సరైనోడు దర్శకుడు బోయపాటి శ్రీను కూడా రకుల్ మాయలో పడ్డాడు. సినిమాకు ప్రమోషన్స్ లో ఇచ్చిన ప్రతి ఇంటర్వ్యూలో రకుల్ గురించి ప్రత్యేకంగా ప్రస్థావిస్తున్నాడు. అంతేకాదు హీరోయిన్స్ ఎలా ఉండాలో రకుల్ ను చూసి నేర్చుకోవాలని చెప్తున్నాడు.
అన్నట్టు అమ్మడు దర్శక నిర్మాతలకు ఖర్చు తగ్గించే పనులు చాలా చేస్తుందట. షూటింగ్ లో కూడా ఎన్ని టేకులైనా సరే అసలు విసుక్కోదట. అందుకే రకుల్ అంటే పడి చస్తున్నారు అందరు. ఇక బోయపాటి విషయానికొస్తే రకుల్ తో మళ్లీ మళ్లీ పనిచేయాలనే ఉద్దేశంతోనే తర్వాత తీస్తున్న సినిమాలో కూడా ఆమెను హీరోయిన్ గా ఓకే చేశాడు. సో రకుల్ హీరోలనే కాదు దర్శకులను కూడా ఇలా బుట్టలో వేసుకుంటుందన్నమాట. మరి ఇదే ఫాంను కొనసాగిస్తే రకుల్ కు ఇంకా ఐదేళ్ల దాకా తిరుగుండదు అని చెప్పాలి.