రివ్యూ : బాయ్స్ హాస్టల్

Boys Hostel Movie Telugu Review

రేటింగ్‌: 2.5/5

సినిమాని ఇలానే తీయాలనే రూల్ లేదు. ఈ మీటర్ లో ఉండాలనే పరిమితి అంతకంటే లేదు. ఎలాంటి రూల్స్ , పరిమితులు లేవు కాబట్టే ఎన్నో రకాల సినిమాలు వస్తుంటాయి . ఎలా తీసిన ప్రేక్షకులకు వినోదం పంచడమే అంతిమ లక్ష్యమని మాత్రం చాలా మంది ఫిల్మ్ మేకర్స్ బావిస్తారు. కొత్త దర్శకుడు నితిన్ కృష్ణమూర్తి కూడా ఆ అభిప్రాయంతోనే ‘హాస్టల్‌ హుడుగారు బేకగిద్దరే’ ని తెరకెక్కించాడు. కన్నడ లో మంచి ఆదరణ పొందిన ఈ సినిమా తెలుగులో ‘బాయ్స్‌ హాస్టల్‌’గా విడుదలైంది. మరి కన్నడ ప్రేక్షకులకు నచ్చిన అంశాలు తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యాయా ? ఇందులో దర్శకుడు చూపించిన కొత్తదనం ఏమిటి ? అసలు బాయ్స్ హాస్టల్ లో ఏం జరిగింది ?

తుంగా అనే బాయ్స్ హాస్టల్ లో ఒక్క రాత్రిలో జరిగే కథ ఇది. హాస్టల్ వార్డెన్‌(మంజునాథ నాయక్‌) అనుమానస్పద స్థితిలో చనిపోతాడు. అతని బాడీ దగ్గర ఓ లెటర్ దొరుకుతుంది. నా చావుకి కారణం వీళ్ళే అని కొందరు విద్యార్ధుల పేర్లు రాసి చనిపోతాడు వార్డెన్. తెల్లారితే పరీక్షలు. డెడ్ బాడీని, ఆ లెటర్ ని చూసిన స్టూడెంట్స్ కి ఏం చేయాలో అర్ధం కాదు. లెటర్ ని మాయం చేసి వార్డెన్ మరణాన్ని ఒక యాక్సిడెంట్ లా క్రియేట్ చేయాలని అనుకుంటారు. తర్వాత ఏం జరిగింది? అనేది మిగతా కథ.

కథ చెప్పినప్పుడు హాస్టల్ వార్డెన్ పాత్ర తప్పితే మరో పాత్ర గురించి రాయలేదు. ఇందులో కీలకమైన పాత్రలు లేవా ? అనే అనుమానం రావచ్చు. దాదాపు ఐదు వందలమంది కనిపిస్తారు ఇందులో. వందకి పైగా పాత్రలకు డైలాగులు వున్నాయి. అందుకే వార్డెన్ తప్పితే ఇందులో ప్రత్యేకించి చెప్పుకోవడానికి ఏ పాత్ర లేకపోవడమే ఇందులో ప్రత్యేకత. ఇందులో విలన్ హీరో అంటూ ఎవరూ వుండరు. ఈవీవీ సినిమా టైటిల్ లా ‘ఎవడి గోల వాడిదే ‘.

ఈ కథ టేకింగ్ చాలా సాంప్రదాయానికి భిన్నంగా వుంటుంది. పాత్రల పరిచయాలు, పేర్లు, గుణగణాలు చెప్పడం ఏమీ వుండదు. అందులో వార్డెన్ చాలా స్ట్రిక్ట్ అనే ఒక క్యారెక్టర్ తప్పితే మిగతా స్టూడెంట్స్ అంతా బౌన్సర్స్ లా వచ్చి పడతారు. వాటిని అర్ధం చేసుకోవడానికి కాస్త టైం పడుతుంది. ఒక్కసారి పట్టుదొరికాక ఆ పాత్రలు మనకి పరిచయం లేకపోయినా అవి చేసే అల్లరితో కనెక్ట్ అయిపోతాం. ఇందులో వున్న హ్యుమర్ కూడా కంప్లీట్ న్యూ జనరేషన్ హ్యుమర్. ఒక డైలాగ్ చెప్పిన తర్వాత దాని కౌంటర్ కోసం వెయిట్ చేసి జోక్ పేల్చినట్లు ఏమీ వుండదు. ఫ్లోలో వెళ్ళిపోతుంటాయి. ఉదాహరణగా చెప్పాలంటే.. వార్డెన్ రాసి లెటర్ లో పేర్లు వున్న స్టూడెంట్స్ చాలా కంగారు పడిపోతారు. అందులో ఒకడు ఆ లెటర్ ని తిని మళ్ళీ కక్కేస్తాడు. అది చూసి ‘బిర్యాని లో చికెన్ ముక్క రాలేదన్నావ్ మరి ఇదేంటని’’ అడుగుతాడు. తెరపై చూస్తున్నపుడు ఇది భలే అనిపిస్తుంది. ఆ లెటర్ గోల అక్కడితో ఆగదు. డేడ్ బాడీ ని నాలుగో ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్ కి ఎవరి కంటపడకుండా తీసుకురావాలి. ఇది తెరపై చూస్తున్నప్పుడు నాన్ సెన్స్ అనిపిస్తుంది. కానీ ఈ నాన్ సెన్స్ నుంచి కూడా చాలా హ్యుమర్ ని పండించారు. అందులో ఎవడూ కోపరేట్ చేయకపోయినా వాడి పేరు లెటర్ లో యాడ్ చేస్తామనని ఒక గ్యాంగ్ బెదిరించడం తెగ నవ్విస్తుంది.

సినిమా మొదలైన చాలా సేపటివరకూ ఇందులో కథ ఏమిటో రిజిస్టర్ కాదు. అయినా బాయ్స్ చేసే హంగామాతో అలా టైం పాస్ అయిపోతుంటుంది. ఇంటర్వెల్ లో ఈ కథ గురించి తెలుస్తుంది. ఆ ట్విస్ట్ కూడా చాలా బావుటుంది. కొన్ని సినిమాలకి బ్రేక్ తర్వాత ఏం జారుతుందో అనే ఆసక్తి వుంటుంది. ఐతే ఈ సినిమా ఆ అవకాశం ఇవ్వదు. కొత్త దర్శకుడు భలే కొత్తగా తీశాడు..అందుకే ఎడిటింగ్ ఇలా ఉందా ? కెమరా అటు ఇటు కదలడానికి కారణం ఇదా ? అని తొలిసగంలో జరిగిన సీన్స్ అన్నిటిని ఒక్కసారి గుర్తు చేసులోవాలనిపిస్తుంది బ్రేక్ టైం లో.

కొన్ని కథల్లో మ్యాజిక్ వుంటుంది. మ్యాజిక్ ..సీక్రెట్ గా ఉన్నప్పుడే అది మ్యాజిక్ లా అనిపిస్తుంది. ఒక్కసారి ఆ మ్యాజిక్ ని విడమర్చి చెప్పిన తర్వాత.. అందులో ఇంక కిక్ వుండదు. బాయ్స్ హాస్టల్ సెకండ్ హాఫ్ లో కూడా అదే జరిగింది. ఇందులో ఏం జరిగిందో తెలిసిపోయిన తర్వాత వచ్చే సన్నివేశాల్లో పట్టు తగ్గింది. ఈ కథని నడిపిస్తున్న రాజీవ్ ( ప్రజ్వల్) పాత్రే ఇంక నేను విసిగిపోయాను వద్దు ఆపేద్దామని అంటాడు. ప్రేక్షకుడికి కూడా ఒక దశలో ఇలాంటి ఫీలింగే కలుగుతుంది. సెకండ్ హాఫ్ లో కూడా కొన్ని నవ్వుకునే సీన్స్ ఉన్నప్పటికీ కథలో సీరియస్ నెస్ తగ్గిపోవడంతో లైట్ అనిపిస్తుంది. ఐతే ఇందులో బాయ్స్ తో చేసిన ఫన్ మొనాటిని అయిపోతుందని తెలుసుకున్న దర్శకుడు వార్డెన్ పాత్రకు కాస్త ఎమోషనల్ టచ్ ఇవ్వాలని చూశాడు. అది క్లైమాక్స్ లో ఓకే అనిపిస్తుంది.

ముందే చెప్పుకున్నట్లు ఇందులో హీరో విలన్ అంటూ ఎవరూ లేరు. రాజీవ్ పాత్ర చేసిన ప్రజ్వల్ కథని ముందుకు నడపడంలో మంచి ప్రతిభ కనబరిచాడు. తన నటన సహజంగా వుంది. దర్శకుడు నితిన్ ఇందులో సినియర్ గురూజీ పాత్రలో కనిపిస్తాడు. భలే కుదిరింది ఆ పాత్ర . క్రేజీ గా వుంటుంది. గిరీశంలా లెక్చర్లు దంచేసే పాత్ర. సమయం విలువ గురించి చెప్పే వాచ్ సీన్ అయితే హిలేరియస్. రిషబ్ శెట్టి, పవన్ అతిధి పాత్రలలో కనిపిస్తారు. హాస్టల్ కి వచ్చి వాళ్ళు చేసే గోల సరిగ్గా రిజిస్టర్ కాలేదు. మిగతా బాయ్స్ బ్యాచ్ అంతా కావాల్సిన వినోదం జోడించారు. అందరూ తెలుగు ప్రేక్షకులకు కొత్త మొహలే అయినప్పటికీ వాళ్ళ డబ్బింగ్ చక్కగా కుదరడంతో భలే నవ్వించేశారు. హాస్టల్ వార్డెన్ గా చేసిన మంజునాథ పాత్రలో ఇందులో ప్రత్యేక ఆకర్షణ. తరుణ్ భాస్కర్ పాత్ర చిన్నదే కానీ అది స్క్రీన్ ప్లే లో వుంటుంది. రష్మి గౌతమ్ తో ఓ హాట్ పాత్ర చేయించారు. అది కథకు అవసరం లేదు కానీ అవసరమే. అదే మ్యాజిక్కు. ఎడిటింగ్ టేబుల్ దగ్గర వున్న పాత్ర ఇది. ఎడిటర్ కావలసినప్పుడు ఒకొక్క సీన్ యాడ్ చేసుకుంటూ వెళుతుంటాడు. గ్లామరస్ హీరోయిన్స్ పై అదొక సెటైర్.

టెక్నికల్ గా ముందు ఎడిటర్ గురించి చెప్పాలి. ఇందులో సీన్స్ ని ఎడిట్ చేయలేదు. అలా ఎడిట్ చేయకపోవడమే ఒకరకమైన ఎడిటింగ్. చెప్పుకోవాలంటే ప్రతి సీన్ ని దర్శకుడే ఎడిట్ చేసి టేబుల్ మీద పెట్టాడు. నిజంగా కొత్తరకం ప్రయోగం ఇది. కెమరా వర్క్ కి కూడా మంచి మార్కులు పడతాయి. హ్యాండ్ టు హ్యాండ్ కెమరాతో ఈ సినిమా షూట్ చేశారు. అలా చేతులో కెమరాపట్టుకొని సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వడం ఒక సవాలే. పది సెకన్లు గ్యాప్ లేకుండా డైలాగులు మోత మోగుతుంటుంది. ఆ మధ్యలో చొరబడి మ్యూజిక్ చేశాడు అజీనిష్ లోక్ నాధ్. ఇది చక్కగా కుదిరింది. డబ్బింగ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. తెలుగుదనం ఒట్టిపడే వాయిస్ లుని యాసలతో సహా వినిపిస్తాయి. అదే ఇందులో నవ్వులకు ముఖ్యకారణం. డైలాగుల కోసం వైరల్ మీమ్స్ స్టఫ్ ని బాగానేవాడుకున్నారు. అంతా కుర్రోళ్ళు కాబట్టి అదొక కంప్లయింట్ లా అనిపించదు. కథ, చిత్రీకరణ, సాంకేతికంగా కొత్త తరహా చిత్రమిది. మేకింగ్, ఎడిటింగ్ స్టయిల్ అందరికీ కనెక్ట్ అవుతుందా అనేది చెప్పలేం. న్యూ జనరేషన్ కంటెంట్ ని ఇష్టపడేవారికి బాయ్స్ హాస్టల్ నచ్చే అవకాశం వుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డి-ఏజింగ్… లాభమా? నష్టమా ?

సినిమాలో ఒక క్యారెక్టర్ బాల్యం, యవ్వనం, కౌమార, ప్రౌడ దశలని చూపించడం ఫిల్మ్ మేకర్స్ కి పెద్ద సవాల్. ఇందుకోసం హలీవుడ్ నుంచి కూడా మేకప్ మ్యాన్ లని దిగుమతి చేసుకునే వారు....

దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో దివ్వెల మాధురీ !

దువ్వాడ ఫ్యామిలీ డ్రామాలో కొత్త కొత్త ఎపిసోడ్లు ప్రారంభమవుతున్నాయి. కొద్ది రోజుల పాటు సైలెంట్ గా ఉంటానని చెప్పిన దివ్వెల మాధురీ.. ఒక్క సారిగా.. ఏకంగా దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లోనే ప్రత్యక్షమయ్యారు. దువ్వాడ...

ఆ పడవలు నందిగం సురేష్ తాలూకానే !

ప్రకాశం బ్యారేజీకి వరద వస్తే ఈ మధ్య బోట్లు కొట్టుకు వస్తున్నాయి. బ్యారేజని డ్యామేజ్ చేస్తున్నాయి. అవి ఎలా వస్తున్నాయో తెలియడం లేదు. ఇప్పుడు మిస్టరీ బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ రంగులేసిన...

శభాష్ నిమ్మల… అభినందించిన నారా లోకేష్

భారీ వర్షానికి తోడు బుడమేరకు పడిన గండ్లు విజయవాడను ముంచేత్తాయి. కనీవినీ ఎరుగని స్థాయిలో వరద పోటెత్తడంతో విజయవాడ గత ఆరు రోజులుగా వరదలో నానుతోంది. బుడమేరుకు పడిన గండ్లు పూడ్చితేనే విజయవాడకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close