ఎవరికైనా పదవి వస్తే ఆయనను అభినందించడం వేరు. ఆయనే వెళ్లి అందరితో సమావేశమవడం వేరు. టీటీడీ చైర్మన్‌గా పదవి పొందిన టీవీ5 చానల్ ఓనర్ బీఆర్ నాయుడు .. తనను అభినందించేవారి తాను వెళ్లి కలిసేవారే ఎక్కువ అయిపోయారు. ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడా లేకుండా… హోదాలను కూడా పట్టించుకోకుండా వెళ్లి కలుస్తున్నారు. ఓ మీడియా చానల్ ఓనర్‌గా అయన దగ్గరకే వచ్చి కలుస్తూంటారు ఎక్కువ మంది ఇప్పుడు టీటీడీ చైర్మన్ పోస్టు అంటే ఇంక ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
కానీ బీఆర్ నాయుడు ఎందుకో కానీ తానే స్వయంగా అందరి ఇళ్లకు వెళ్తున్నారు. మొదట కేటీఆర్ దగ్గరకు వెళ్లారు. తర్వాత రేవంత్ దగ్గరకు వెళ్లారు. అంతగా వెళ్లాలనుకుంటే ముందుగా ప్రోటోకాల్ ప్రకారం సీఎం దగ్గరకు వెళ్లిన తర్వాత ఇతర నేతల వద్దకు వెళ్లాలి. కానీ బీఆర్ నాయుడు మాత్రం ఓ లిస్టు రాసుకుని ఎవరు ముందుగా దొరికితే వారిని కలిసి బోకే ఇస్తున్నారు. తాజాగా ఆయన మాజీ మంత్రి తలసానిని కూడా కలవడంతో .. ఆయన తీరుపై కోపంతో ఉన్న వారు బరస్ట్ అవుతున్నారు.
టీటీడీ చైర్మన్ అంటే ఎంత పవర్ ఫుల్లో చెప్పాల్సిన పని లేదు. ఆ పవర్ ప్రకారం.. ఆయన దగ్గరకే వచ్చి తలసాని లాంటి వాళ్లు అభినందనలు చెప్పాలి. కానీ తలసాని దగ్గరకే చైర్మన్ వెళ్లారు. టీటీడీ విషయంలో ఏమైనా విమర్శలు చేయాల్సి వస్తే వీరంతా.. మన ఇంటిక వచ్చి మరీ కలిశారు కదా… విమర్శలు ఎందుకులే అని సైలెంటుగా గా ఉంటారని బీఆర్ నాయుడు అనుకుంటున్నారేమో కానీ.. ఆయన భేటీలు మాత్రం చాలా ఓవర్ అవుతున్నాయన్న విమర్శలు ప్రారంభమయ్యాయి. ఇంతటితో ఆపేస్తే బెటర్ అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.