ఇటీవల ఓ పెళ్లికి పల్లవి ప్రశాంత్ అనే వ్యక్తి ఓ పెళ్లికి వెళ్లాడు. అతని పక్కన ఆరుగురు బౌన్సర్లు ఉన్నారు. ఎవడీడు అని అందరూ విచిత్రంగా చూస్తున్నారు. ఎప్పడో బిగ్ బిస్ విన్నర్. ఇప్పుడు బౌన్సర్లు పెట్టుకుని ఎందుకు తిరుగుతున్నాడు?. అలాగే ఓ యూట్యాబర్… వాడు కూడా ఓ అరడజన్ మంది బౌన్సర్లను వేసుకుని మాల్ కు వెళ్లి డబ్బులు పంచుతా అని హడావుడిచేశారు. వీళ్లను పక్కన వాళ్లు కూడా పట్టించుకోరు. మరి బౌన్సర్లు ఎేందుకు?. ఆ బౌన్సర్లు ఉంటే తమను తాము పెద్ద సెలబ్రిటీలుగా చూపించుకోవడానికి.. పెద్ద సెక్యూరిటీ ఉన్నట్లుగా హడావుడి చేయడానికి.
వీళ్లే ఇంత హడావుడి చేస్తే సినిమాల్లో కాస్త పేరున్నవారు తగ్గుతారా ?. హీరోలందరికీ ప్రత్యేకమైన బౌన్సర్ల గ్యాంగ్ ఉంటుంది. ఎప్పుడు బయటకు వెళ్తే అప్పుడు వచ్చి ఫ్యాన్స్ పై తమ ప్రతాపాన్ని చూపిస్తూ ఉంటారు. అయితే ఇది తొక్కిసలాటకు కారణం అయిందని ఓ హీరోకు లేని పోని సమస్యలు తెచ్చి పెట్టింది. ఈ బౌన్సర్ల గురించి పోలీసులు కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పుుడు ఈ జాడ్యం… సెట్స్ లోకి కూడా పాకిపోయిందని బాధపడుతున్నారు ఇతర ఆర్టిస్టులు. తాజాగా సినీ నటుడు బ్రహ్మాజీ ఈ అంశంపై పోస్టు పెట్టారు. మేము చేసే యాక్షన్ కన్నా బౌన్సర్లు చేసే ఓవరాక్షన్ చాలా ఎక్కువగా ఉందని ఆయన పెట్టిన పోస్టులు వైరల్ అయ్యాయి.
అవుట్ డోర్ లో అయితే ఏదో విధంగా బౌన్సర్ల ఉపయోగాన్ని సమర్థించుకోవచ్చు కానీ.. ఇలా సెట్స్ లలో కూడా బౌన్సర్లను వాడటాన్ని ఏమనుకోవాలని ఆయన ప్రశ్నిస్తున్నారు. అంటే యూనిట్ సభ్యులు కూడా మీద పడిపోతారన్న ఫీలింగ్ కు .. స్టార్ కాని స్టార్లు వచ్చేస్తున్నారా లేకపోతే నిర్మాతల సొమ్మే కదా అని విచ్చలవిడిగా షో చేయడానికి ప్రయత్నిస్తున్నారా అన్నది అర్థం కాని విషయం. సెట్స్ లో కూడా బౌన్సర్లు అంటే.. ఇక సినిమా తారలు నేల మీద ఉండనట్లే.