జబర్ దస్త్ చూసే వాళ్లకు .. గెటప్ శ్రీను వేసిన బిల్డప్ బాబాయ్ ఎపిసోడ్ బాగా గుర్తుండిపోయి ఉంటుంది. `నమ్మరేంట్రా బాబూ` అంటూ డిఫరెంట్ మేనరిజమ్ తో.. చేసిన ఎపిసోడ్ క్లిక్కయ్యింది. ఇప్పుడు ఇలాంటి క్యారెక్టర్‌నే బ్రహ్మానందం చేయబోతున్నాడు. అదీ వెండి తెరపై.
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు `పెళ్లి సందD` రూపొందుతున్న సంగతి తెలిసిందే. శ్రీకాంత్ తనయుడు రోషన్ కథానాయకుడిగా నటిస్తున్నాడు. షూటింగ్ దాదాపుగా పూర్తయ్యింది. ఈ సినిమాలో బిల్డప్ బాబాయ్ అనే ఓ వెరైటీ క్యారెక్టర్ ఉంది. ఆ పాత్రలో బ్రహ్మానందం కనిపించబోతున్నాడు. అందుకు సంబంధించిన చిత్రీకరణ కూడా పూర్తయ్యింది. ఈమధ్య బ్రహ్మానందం వెండి తెరపై పెద్దగా కనిపించలేదు. `జాతిరత్నాలు`లో జడ్జ్ పాత్ర చేశాడంతే. అయితే ఆ ఎపిసోడ్ బాగా పేలింది. ఇప్పుడు `పెళ్లిసందడి`లో బ్రహ్మానందం కనిపించేది కాసేపే అయినా ఆ ఎపిసోడ్ హిలేరియస్‌గా ఉంటుందని సమాచారం. సినిమాల్లో వచ్చే పాత్రలకు స్నూఫ్లుగా మార్చుకుని జబర్దస్త్‌లో నవ్విస్తుంటారు. అలాంటిది జబర్దస్త్ లో పేలిన ఓ పాత్ర.. వెండి తెరపైకి రావడం ఇదే తొలిసారి.