ఏపీ మంత్రి కొడాలి నానిపై రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ స్టేషన్లకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. పార్టీలకు అతీతంగా బ్రాహ్మణ సంఘాలు.. కొడాలి నాని చర్యలు తీసుకోవాలంటూ.. ఫిర్యాదులు చేస్తున్నారు. దీనికి కారణం… తిరుమల ఆలయంపై అనుచిత వ్యాఖ్యలు చేయడమే. తిరుమల ఆలయం మీ అమ్మ మొగుడు కట్టాడా. . జగన్ కు డిక్లరేషన్ కు ఇవ్వకుండా ఎక్కడికైనా వెళ్లే హక్కు ఉందంటూ.. కొడాలి నాని చెలరేగిపోయారు. ఈ వీడియోను… తెలుగు360 హైలెట్ చేయడంతో.. శ్రీవారి భక్తుల్లో బ్రాహ్మణ సంఘాల్లో కదలిక ప్రారంభమయింది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా… మంత్రి తీరుపై విస్మయం వ్యక్తం చేసారు. వెంకటేశ్వరస్వామిని దూషించే మంత్రులు జగన్ కేబినెట్లో ఉన్నారని మండిపడ్డారు. తిరుపతి ఆలయంలోకి వెళ్లేటప్పుడు.. సంప్రదాయాలు పాటించాలని.. లేకపోతే వెళ్లడం మానుకోవాలన్నారు.
పార్టీలకు అతీతంగా బ్రాహ్మణ సంఘాలు.. కొడాలి నానిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం లాంటి వాళ్లు డిక్లరేషన్ ఇచ్చి ఆలయంలోకి వెళ్లారని..కానీ సీఎం జగన్కు ఎలాంటి డిక్లరేషన్ లేదన్నట్లు మంత్రులు మాట్లాడుతున్నారని మండి పడుతున్నారు. ఏపీ మంత్రులు సాక్షాత్తూ కలియుగ దేవుడినే కించపరిచేట్లు మాట్లాడటం మంచిది కాదని.. బ్రహ్మణ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ ఆనంద్ సూర్య విమర్శించారు. వైఎస్ జగన్ తన మతంతో పాటు ఇతర మతాలను గౌరవించాల్సిన అవసరం ఉందని సూచించారు. కొడాలి నాని తన వ్యాఖ్యలకు వెంకటేశ్వరస్వామి పాదాలపై పడి క్షమాపణలు చెప్పాలన్నారు. కొడాలి నానిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆనంద్ సూర్య. బీజేపీ నేత భానుప్రకాశ్ రెడ్డి కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
జగన్మోహన్ రెడ్డి కొడాలి నానిపై చర్యలు తీసుకోకపోతే… కోర్టులో పోరాడతామంటున్నారు. టీటీడీ కొడాలి నానిపై పరువు నష్టం దావా వేయాలనే డిమాండ్ ను వినిపిస్తున్నారు. ఈ వివాదంలో కొడాలి నాని క్షమాపణ చెప్పుకోవడమో… వివరణ ఇచ్చుకోవడమో చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.