సూపర్ స్టార్ మహేష్ హీరోగా నటించిన ‘బ్రహ్మోత్సవం’ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున గత వారం విడుదలైన విషయం తెలిసిందే. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో పి వి పి బ్యానర్ లో ప్రసాద్ వి పోట్లురి నిర్మించిన ఈ సినిమా కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూడగా, సినిమా మాత్రం వారిని అనుకున్నంత మేర ఆకట్టుకోలేకపోయింది. మొదటిరోజు నుంచే ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా, బాక్సాఫీస్ వద్ద మొదటి వారాంతం మంచి కలెక్షన్స్‌నే రాబట్టింది. అయితే సోమవారం నుంచి కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి. ఇక మొదటి వారం మొత్తం పూర్తయ్యే సరికి నైజాం ఏరియాలో ‘బ్రహ్మోత్సవం’ సినిమా 8.35 కోట్ల రూపాయలు, సిడేడ్ 3.8 కోట్ల షేర్ రాబట్టింది. సినిమాను నైజాం ప్రాంతంలో విడుదల చేసిన అభిషేక్ పిక్చర్స్ ఈ కలెక్షన్స్‌ను అధికారికంగా ప్రకటించింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ సినిమాలో మహేష్ సరసన కాజల్, సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటించారు.