శ్రీకాంత్ అడ్డాల సినిమాలు చాలా సుదీర్ఘంగా సాగుతాయి. చెప్పదలచుకొన్న పాయింట్‌పై ఉన్న నమ్మకం.. తీసే సన్నివేశంపై ఉన్న మమకారంతో… నిడివి విషయం పట్టించుకోరు. బ్రహ్మోత్సవం సినిమా కూడా అలా సుదీర్ఘంగా సాగబోతోందా, ఈ సినిమా కూడా ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుందా అనే అనుమానాలొచ్చాయి. అయితే బ్రహ్మోత్సం నిడివి విషయంలో ఇటు మహేష్ బాబు అటు నిర్మాత పట్టుబట్టడంతో ఈ సినిమాకి సరైన రన్టైమే ఫిక్సయ్యింది. 2గంటల 33 నిమిషాల సినిమా తయారైంది.
153 నిమిషాల నిడివితో బ్రహ్మోత్సవం సెన్సార్ ముందుకు వెళ్లింది. కట్స్ లేకుండా పోవడంతో అంతే సినిమా బయటకు వచ్చింది కూడా. ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఆకట్టుకోవడం ఖాయమని, క్లాస్ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చుతుందని సెన్సార్ సభ్యులు చెబుతున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. అక్కడక్కడ కొన్ని సీన్లు లాగ్ అనిపించినా, కంటెంట్ బాగుండడంతో సాపీగా సాగిపోయిందని, ఈ సినిమా మొత్తాన్ని మహేష్ బాబు తన భుజస్కంధాలపై వేసుకొని నడిపించాడని, సినిమాలో ఎంతమంది ఆర్టిస్టులున్నా మహేష్ బాబు ఒక్కడే సెంట్రాఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచాడని, ఇది పూర్తిగా మహేష్ సినిమా అని చెబుతున్నారు. మహేష్ అభిమానులకు పండగే ఇక.