ప్రతీ సినిమాకీ శాటిలైట్ ద్వారా వచ్చే ఆదాయం వెన్నుదన్నుగా నిలుస్తోంది. పెద్ద సినిమాకైతే ఇక చెప్పక్కర్లెద్దు. విడుదలకు ముందే టీవీ ఛానళ్లు కర్చీఫ్లు వేసేస్తాయి. కుటుంబ కథా చిత్రం, అందులోనూ స్టార్ హీరో సినిమా అంటే.. ఛానళ్లు ఎగబడతాయి. అందుకే ఇప్పుడ బ్రహ్మోత్సవం సినిమాకీ భలే గిరికీ ఏర్పడింది. మా, జెమినీ, జీ తెలుగు ఈ సినిమా రైట్స్ కోసం విపరీతంగా పోటీపడ్డాయి. చివరికి జీ తెలుగు ఈ సినిమాకి రూ.11 కోట్లకు దక్కించుకొందని టాక్. ప్రస్తుతం బ్రహ్మోత్సవం చిత్రీకరణ దశలో ఉంది. మేలో విడుదల చేస్తారు. రెండు నెలల ముందే శాటిలైట్ హాట్ కేకులా అమ్ముడైపోవడం విశేషం.
మహేష్ నటించిన శ్రీమంతుడు రైట్స్ కూడా జీ తెలుగు దగ్గరే ఉంది. ఆసినిమానీ భారీ రేటుకే కొనుకోలు చేసింది. శ్రీమంతుడు హిట్ అవ్వడంతో.. ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా నచ్చడంతో ఆ సినిమా ఎప్పుడొచ్చినా రేటింగ్స్ భారీగా ఉంటున్నాయి. అదే నమ్మకంతో ఇప్పుడు ఈ సినిమాని జీ విడుదలకు రెండు నెలల ముందే కొనేసింది. మహేష్ కెరీర్లో శాటిలైట్ పరంగా ఈ సినిమానే రికార్డు సృష్టించదనుకోవాలి.