తెలంగాణ తెలుగు దేశం పార్టీ నాయకులు జరిపోతున్నప్పటికి కనీసం ప్రజల్లో తమ ఇమేజ్ ను కాపాడుకోవడానికి నానా తంటాలు పడుతున్నది. జనం లోకి ఏదో ఒకటి చేయక పోతే పార్టీ మనుగడ కష్టం అనే సంగతి వారందరికీ చాలా బాగా అర్ధం అయింది. అందుకే.. పార్టీలో మిగిలిన వారు అనేక ప్రణాళికలు రచిస్తున్నారు. తాజాగా కరవు యాత్ర చేపట్టాలని పార్టీ నిర్ణయించింది.
ఇదంతా బాగానే ఉంది. కరవు యాత్ర చేపట్టడం అనేది కొత్త ఆలోచన కాదు. ఒకరకంగా చెప్పాలంటే.. ఈ విషయంలో టీడీపీ వెనుకబడి ఉంది. కాంగ్రెస్ ముందంజ లో ఉన్నట్టు లెక్క. ఒకే దెబ్బకు కెసిఆర్ ను, కేంద్రంలో మోడీని ఇద్దరినీ విమర్శించవచ్చు గనుక వారు వేగంగా కరవు ఉద్యమం తీసుకున్నారు. లేట్ అయినప్పటికీ టీడీపీ కి కూడా ఇది మైలేజి ఇస్తుంది. కాకుంటే తక్కువ మైలేజి వస్తుంది.
ఇకపోతే మరొక కీలకాంశం ఉంది. కొన్ని రోజుల కిందట తెలంగాణ మొత్తం పాదయాత్ర చేయబోతున్నట్లు వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రస్తుతం కరవు యాత్ర ప్రకటించిన దృష్ట్యా, ఇక రేవంత్ యాత్ర అటక ఎక్కినట్లే. అసలు అయన పాదయాత్ర జరుగుతుందో లేదో కూడా ఇక డౌటే. అయితే రేవంత్ యాత్ర కు చెక్ పెట్టడానికే ఈ కరవు యాత్ర ప్లాన్ చేసారా? లేదా, యాదృచ్చికంగా జరుగుతున్నదా అనేది డౌటు. ఈ యాత్రలన్నీ తెలంగాణ టీడీపీ అంతర్గత రాజకీయాల్లో ఎలాంటి కొత్త మార్పులు తెస్తాయో వేచి చూడాలి.