గోవాలో ఓ వంతెన కూలిపోయింది. యాబైమంది బరువును తట్టుకోలేక అది కుప్పకూలింది. ఆ వంతెన మన కాలంలో నిర్మించింది కాదు లెంది. పోర్చుగీసు కాలంలో నిర్మించిందట. శాన్వర్డెన్ నదిపై దీన్ని కట్టారు. గోవాలోని కర్చొరిన్ గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు వంతెనపై నుంచి నదిలో దూకి, ఆత్మహత్యకు ప్రయత్నించారు. ఇది చూసిన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సాయంతో నదిలో గాలింపు చర్యలను చేపట్టారు. వీటిని చూసేందుకు 50మంది ఆ వంతెనపై నిలబడ్డారు. ఆతృతగా చూస్తున్నారు. ఈ బరువును పోర్చుగీసు కాలం నాటి వంతెన భరించలేకపోయింది. ఒక్క సారిగా నదిలో కూలిపోయింది. వాంతా నదిలో పడిపోయారు. ఈత వచ్చిన వారు ఒడ్డుకు చేరారు. మిగిలిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.