టెక్నికల్ బ్రిలియన్స్ విషయంలో తెలుగు సినిమా చాలా చాలా డెవలప్ అవుతోంది. మరీ ముఖ్యంగా గత ఐదేళ్ళుగా అయితే అనూహ్య మార్పు కనిపిస్తోంది. అద్భుతమైన సాంకేతిక నైపుణ్యం ఉన్న కొత్త కొత్త డైరెక్టర్స్ తెరపైకి వస్తున్నారు. ‘తిక్క’ సినిమా డైరెక్టర్‌కి చాలా గొప్ప టెక్నికల్ నాలెడ్జ్ ఉందని సాయి ధరమ్ తేజ్ చెప్పాడు. ఈ రోజు రిలీజ్ అయిన ‘తిక్క’లో సునీల్‌రెడ్డి టెక్నికల్ బ్రిలియన్స్ కంటే కూడా సాహిత్యం, నటన, ఎమోషనల్ క్యారీయింగ్ లాంటి విషయాలపైన కనీస అవగాహన కూడా లేదేమో అన్న అనుమానం వచ్చింది. సీన్లో క్యారీ చేయాలనుకున్న ఎమోషన్ని ఇంకొంచెం ఎఫెక్టివ్‌గా ప్రజెంట్ చేయడానికి టెక్నికల్ నాలెడ్జ్ హెల్ప్ అవ్వాలి కానీ అసలు విషయాన్ని చెడగొట్టేలా ఉండకూడదు. డిఫరెంట్ కెమేరా యాంగిల్స్, లైటింగ్ వర్క్, సిజి వర్క్, షాట్ డివిజన్ లాంటి విషయాల్లో తన టాలెంట్‌ని ప్రదర్శించడానికి సునీల్‌రెడ్డి చాలా ట్రై చేశాడు. కానీ అవన్నీ కూడా సినిమాలో ఉన్న ఫీల్‌ని చెడగొట్టాయే కానీ సినిమాకు ప్లస్ అవ్వలేదు.
సినిమాకు సాంకేతికత కంటే కూడా సాహిత్యమే ముఖ్యం. కథ, కథనం, సన్నివేశాలు, ఆ సన్నివేశాల్లో వచ్చే మాటలే ప్రాణం. ఆ తర్వాత నటీనటుల నటన కూడా కీ రోల్ ప్లే చే్స్తుంది. ఈ అన్ని విషయాలు తెరపైన సవ్యంగా కనిపించడానికి సాంకేతికత తోడ్పడితే చాలు. రచన వీక్‌గా ఉండి, నటీనటుల పెర్ఫార్మెన్స్ బాగాలేకపోతే ఎంత టెక్నికల్ బ్రిలియన్స్ చూపించినా ప్రేక్షకులు ఎంగేజ్ అయ్యే అవకాశముండదు. హై ఎండ్ టెక్నికల్ వ్యాల్యూస్, అద్భుతమైన సిజి వర్క్ లాంటివి లేకపోయినా రచన బాగుండి, నటీనటుల ప్రతిభావంతంగా పెర్ఫార్మ్ చేయగలిగితే ఆ సినిమా హిట్టయ్యే అవకాశాలు ఉంటాయి. అందుకే ఉయ్యాల జంపాల, పెళ్లి చూపులు, ఆనంద్, హ్యాపీ డేస్ లాంటి చిన్న సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అవుతున్నాయి. టెక్నికల్‌గా సినిమాను నెక్ట్స్ లెవెల్‌కి తీసుకోవాలనుకోవడంలో తప్పు లేదు. సాహిత్యంలో విషయం లేకుండా టెక్నిక్‌తో మేజిక్ చేద్దామనుకుంటే మాత్రం సినిమాలు తిక్క తిక్కగానే ఉంటాయి మరి.