దేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీల్లో భారత రాష్ట్ర సమితి అత్యంత రిచ్ పార్టీ. ఆ పార్టీ ఖాతాలో ఎన్నికల ఖర్చులు అయిపోయిన తర్వాత కూడా రు. 1449 కోట్ల రూపాయలు ఉన్నాయి. వచ్చే ఐదేళ్ల పాటు విరాళాలు రాకపోయినా విచ్చలవిడిగా పార్టీ కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి అవకాశం ఉంటుంది. దేశంలో మరే ఇతర ప్రాంతీయ పార్టీకి కనీసం రూ. ఐదు వందల కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్ కూడా లేదు,
ఒడిషా అధికార పార్టీ బీజేడీ, తృణమూల్ పార్టీలకు ఐదు వందల కోట్ల దరిదాపుల్లో బ్యాంక్ డిపాజిట్లు ఉన్నాయి. ఇక టీడీపీకి 227 కోట్లు ఉన్నట్లుగా ఈసీకి ఇచ్చిన రిపోర్టుల్లో తెలియచేశాయి. జాతీయ పార్టీల్లో బీజేపీకి ఉన్నంత సంపద ఏ పార్టీకి లేదు.కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఘోరంగా ఉంది. ఆ పార్టీ కన్నా బీఆర్ఎస్ కే ఎక్కువ నిధులు ఉన్నాయి.
పదేళ్లు తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ .. పార్టీఫండ్ ను బాగానే వెనకేసుకుంది. మేఘా కంపెనీ మహారాజ పోషకురాలిగా ఉంది. ఇతర సబ్సిడరీ కంపెనీలతో కలిసి బీఆర్ఎస్ ఖజానాను నింపింది. ఇతర విధాలుగానూ పెద్ద ఎత్తున విరాళాలువచ్చాయి. మొత్తంగా బీఆర్ఎస్ ఉనికిపై చాలా మందికి సందేహాలు ఉన్నాయి కానీ.. ఈ బ్యాంక్ బ్యాలెన్స్ చూస్తే.. సోషల్ మీడియాలో అయినా పార్టీని నిలబెట్టుకుంటారని అర్థం చేసుకోవచ్చు.