ఉత్తమ్ కుమార్ రెడ్డిని సీఎం చేయాలని బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన కొంత మంది నేతలు … ఊరూపేరు లేని మీడియాలో ప్రచారం చేసేసి.. దాన్ని సోషల్ మీడియాలో పెట్టేసుకుని ఆత్మ సంతృప్తి చెందుతున్నారు. బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ సీఎం మార్పు గురించి మాట్లాడితే దానిపై బీఆర్ఎస్ నేతలు పక్క వాయిదాలు వేస్తున్నారు. అది కూడా బీజేపీలో ఓ వర్గం… బీఆర్ఎస్లో మరో వర్గం మాత్రమే.
పార్టీకి సంబంధం లేని ఎవరో ఏదో మాట్లాడిదే దానిపై కాంగ్రెస్ వర్గం అంతా ఏకమై ఎదురుదాడి చేయకపోతే ఏదో ఉన్నట్లేనని అనుకుంటారనే ధీరీతో ప్రారంభించి… రేవంత్ రెడ్డిని ఎలాగైనా కనీసం తమ వార్తల్లో అయినా సీఎంగా తప్పించాలన్న ఓ ప్రయత్నం చేస్తున్నారు. వారి ప్రయత్నాలు చూసి సామాన్య జనం చర్చల్లో పెడితే అదే చాలు అనుకుంటున్నారు. అయితే అలాంటివి రేవంత్ పై మరింత సానుభూతి పెంచుతాయని ఆయా పార్టీలు ఊహించలేకపోతున్నాయి
రేవంత్ ను తీసేసి ఉత్తమ్ ను పెడతారని ప్రచారం చేయడం వల్ల వారు ఉత్తమ్ కు మేలు చేస్తున్నారని అనుకుటున్నారేమో .. రేవంత్ కు నష్టం చేస్తున్నామని అనుకుంటున్నారమో కానీ.. ఘోరమైన తప్పిదం చేస్తున్నారని మాత్రం రాజకీయంగా కాస్త అవగాహన ఉన్న వారికి అర్థమవుతుంది. ఉత్తమ్ రెడ్డి సామర్థ్యం ఏమిటో ఆయనకు పీసీసీ ఇచ్చిన తర్వాత ఎదుర్కొన్న ఎన్నికలే నిరూపించాయి. ఆయన పై కాంగ్రెస్ హైకమాండ్ కు ఉన్న అభిప్రాయమేంటో కూడా కాంగ్రెస్ లో అందరికీ తెలుసు. ఇప్పుడు దాన్ని మరింతగా పెంచుతున్నారు.
రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ చేయకుండా ఉండటానికి ఎన్నో కుట్రలు పన్నారు. ఎన్నో కేసులు పెట్టారు. ఆయన పై కేటీఆర్ ఎన్ని సార్లు రాహుల్ కు నేరుగా ట్యాగ్ చేసి ఫిర్యాదు చేశారో లెక్కే లేదు. గాంధీ భవన్ లో గాడ్సే అంటూ ఎన్నో ప్రచారాలు చేశారు. కానీ రేవంత్ పెంచుకున్న నమ్మకం ముందు అవన్నీ తేలిపోయాయి. అయినా ఆ పార్టీలో మరో ప్రయత్నం చేస్తున్నాయి.