భారత రాష్ట్ర సమితి చీఫ్ కేసీఆర్ తుంటి గాయం నుంచి కోలుకుని మొదటి సారి అధికారికంగా పార్టీ కార్యక్రమంలో పాల్గొన్నారు. పార్లమెంటరీ పార్టీ భేటీని ఫామ్ హౌస్ లో నిర్వహించారు. ఎంపీలంతా అక్కడికే వెళ్లారు. పార్లమెంట్ లో ఎలా వ్యవహరించాలో వారికి దిశానిర్దేశం చేశారు. నెలాఖరు రోజు నుంచిపార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. ఫిబ్రవరి ఒకటో తేదీన బడ్జెట్ పెట్టనున్నారు. ఆ సమావేశాలు ముగిసిన తర్వాత పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వస్తుంది.
ఇప్పటి వరకూ రాష్ట్రంలో తెలంగాణలో అధికార పార్టీగా ఉన్న బీఆర్ఎస్ ఇప్పుడు ప్రతిపక్ష పార్టీగా పార్లమెంట్ కు వెళ్తోంది. గతంలో బీజేపీతో ఉన్న ఇష్యూస్ వల్ల ఆ పార్టీని నేరుగా టార్గెట్ చేయలేకపోయింది. ఎక్కువగా వాకౌట్ అస్త్రం ప్రయోగించేవారు. గత పార్లమెంట్ సమావేశాలు మధ్యలోనే వెనక్కి వచ్చేయాలని కేటీఆర్ ఎంపీలను ఆదేశించారు ఇప్పుడు మాత్రం ఎం చేయాలన్నది కేసీఆర్ కూ అర్థం కాని పరిస్థితి ఉంది. రోజువారీగా వ్యూహాలను ఖరారు చేద్దామని సమావేశంలో చెప్పినట్లుగా తెలుస్తోంది. బీజేపీతో ఎగ్రెసివ్ గా వెళ్లాలంటే.. చాలా సమస్యలు వస్తాయి. సాఫ్ట్ గా ఉన్నా అనేక సమస్యలు వస్తాయి.
దేని వల్ల వచ్చే సమస్యల ప్రభావం తక్కువగా ఉంటుందో చూసుకుని ఆ దారిలో వెళ్లాల్సి ఉంటుంది. బీజేపీ .. బీఆర్ఎస్ తో సాఫ్ట్ గా ఉంటుందా.. ఆ పార్టీకి ఏమైనా లైఫ్ ఇవ్వాలని అనుకుంటుందా అన్నదానిపై స్పష్టత లేదు. రెండు పార్టీలు సమన్వయంతో వ్యవహరిస్తే.. తెలంగాణలో ఎక్కవ సీట్లు గెల్చుకునే అవకాశం ఉంటే మాత్రం.. రెండు పార్టీలు ఓ ఒప్పందానికి వచ్చే అవకాశం ఉంది.