ఆరోపణలు, ప్రత్యారోపణలు ఎన్ని అయినా చేసుకోవచ్చు కానీ ప్రభుత్వం జోలికి వస్తే మాత్రం అధికారంలో ఉన్న వారు అంత కూల్‌గా ఉండే అవకాశం ఉండదు. గతంలో రాజ్ భవన్ ముందు జగన్ ప్రభుత్వాన్ని పడగొడతానని చాలెంజ్ చేయడంతో టీడీపీ .. ఆయనకు పార్టికి చెందిన 24 మంది ఎమ్మెల్యేలను చేర్చుకుంది. ఎందుకంటే ఏ ఒక్క చిన్న చాన్స్ కూడా ఇతరులకు ఇవ్వకూడదని అధికార పార్టీలు అనుకుంటాయి.
ఇపుడు తెలంగాణలో అదే పరిస్థితి కనిపిస్తోంది. మీకు కావాల్సినంత డబ్బు ఇస్తాం.. ఎమ్మెల్యేలను కొని ప్రభుత్వాన్ని కూల్చేయండి అని బిల్డర్లు, పారిశ్రామికవేత్తలు బీఆర్ఎస్ ను కోరుతున్నారట. అంత రిస్క్ తీసుకునే బిల్డర్లు ఎవరు ఉంటారో కానీ.. కొత్త ప్రభాకర్ రెడ్డి మాత్రం కాంగ్రెస్ పార్టీపై పెద్ద రాయి వేశారు. అతి తగలాల్సిన చోట తగిలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వానికి తమ ప్రభుత్వంపై జరిగే కుట్రలు తెలుసుకునే వ్యవస్థ ఉంటుంది. నిజంగా అలాంటి బిల్డర్లు, పారిశ్రామిక వేత్తలు ఉంటే.. వారెవరో తెలుసుకోవడం పెద్ద విషయం కాదు.
అదే సమయంలో సీఎం రేవంత్ రెడ్డి తన ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి వైల్డ్ నిర్ణయాలు అయినా తీసుకుంటారు. జరిగిందేదో జరిగిపోయిందనుకునే మనస్థత్వం ఉన్న రాజకీయ నేత కాదు రేవంత్ రెడ్డి. అందుకే కొత్త ప్రభాకర్ రెడ్డి హెచ్చరికలు.. సీరియస్ గా తీసుకునే అవకాశాలు ఉంటాయి. పొంగులేటి వంటి కీలక మంత్రులు వెంటనే స్పందించి.. తాటాకు చప్పుళ్లక.ు భయపడేది లేదని హెచ్చరించారు. భూభారతి ద్వారా వారాంతా దోచేసిన భూముల వివరాలు బయటకు వస్తాయనే ఇలా మాట్లాడుతున్నారని అంటున్నారు.
కారణం ఏదైనా .. వ్యూహాత్మకంగా చేశారా లేకపోతే.. తొందరపాటుతో అలా మాట్లాడారా అన్నది వారికే తెలియాలి. ఏదైనా కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఇప్పుడు అంతే ఘాటుగా స్పందించాల్సిన అవసరం పడింది. మరో పది మంది ఎమ్మెల్యేలను ఫిరాయించేలా చేయడం ద్వారా కౌంటర్ ఇస్తారా.. ఇంకేమైనా చేస్తారా అన్నది చూడాల్సి ఉంది.