తెలంగాణకు అదానీ ఇచ్చిన రూ. వంద కోట్ల విరాళాన్ని విజయవంతంగా వెనక్కి పంపేయడానికి పోరాటం చేసిన బీఆర్ఎస్ ఇప్పుడు.. ఆయన కంపెనీ పెట్టిన .. పెట్టదల్చుకున్న పెట్టుబడుల్ని కూడా వెనక్కి పంపేయాలని డిమాండ్ చేస్తోంది. అవేదో రేవంత్ రెడ్డి సొంత ఖాతాలో జమ చేస్తున్న పెట్టుబడుల మాదిరిగా ప్రచారం చేస్తూ.. బీఆర్ఎస్ నేతలు చేస్తున్న డిమాండ్ చేసి.. పారిశ్రామిక వర్గాలు కూడా ముక్కున వేలేసుకుంటున్నాయి.
కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు అదానీతో చర్చలు జరిపి మరీ పలు సంస్థలు పెట్టించారు. ఆ పెట్టుబడుల్ని కూడా తరిమేయమని చెప్పడం లేదు కానీ.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పెడతానంటున్న సిమెంట్ ఫ్యాక్టరీలు, లాజిస్టిక్ పార్క్ వంటి వాటిని మా్తంర వద్దంటున్నారు. లాజిస్టిక్ పార్క్, సిమెంట్ ఫ్యాక్టరీలు పెడితే తెలంగాణ ప్రజలకే కదా ఉపాధి లభించేది. అదానీ అంతా అవినీతి పరుడు అని సొంతంగా తీర్మానించేందుకు తెలంగాణకు నష్టం జరిగేలా బీఆర్ఎస్ చేస్తున్న రాజకీయం రివర్స్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
చట్టబద్దంగా పెడుతున్న పెట్టుబడుల్ని ఎలా క్యాన్సిల్ చేస్తామని రేవంత్ రెడ్డి అంటూంటే బీఆర్ఎస్ నేతలు మాత్రం అందులో రేవంత్ కు వాటా ఉందన్నట్లుగా ప్రచారం చేయడానికి వెనుకాడటం లేదు. ఏపీలో మాదిరిగా అదానీతో విద్యుత్ ఒప్పందాలను తెలంగాణ ప్రభుత్వం ఒప్పందాలు చేసుకోలేదు. కేవలం పెట్టుబడుల ఒప్పందాలు చేసుకున్నారు. అయినా తెలంగాణకు నష్టం జరిగినా పర్వాలేదు.. యువతకు ఉద్యోగావకాశాలు తగ్గిపోయినా పర్వాలేదు..క్యాన్సిల్ చేయాలంటున్నారు.