హైదరాబాద్ లో 28వేల అక్రమ కట్టడాలు ఉన్నాయి.. వాటన్నింటిని నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తాం..వరదల నుంచి నగరానికి విముక్తి కల్పిస్తామని బీఆర్ఎస్ హయాంలో 2016లోనే కేసీఆర్ ప్రకటించారు.
ఇప్పుడు బీఆర్ఎస్ పాలసీని కాంగ్రెస్ నేతృత్వంలోని రేవంత్ సర్కార్ కొనసాగిస్తుంటే.. కూల్చివేతలు సమంజసం కాదంటూ బీఆర్ఎస్ తొండి వాదన చేస్తోందని కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మొదట్లో హైడ్రాను స్వాగతించలేక, వ్యతిరేకించలేక పాలిటిక్స్ చేసిన బీఆర్ఎస్.. ఇటీవలి కూల్చివేతలు కాస్త వివాదాస్పదం కావడంతో రాజకీయం చేసేందుకు ఇదొక మంచి అవకాశం అనుకున్నారో ఏమో, హైడ్రాపై పోరుబాట పడుతామని కొత్త పల్లవి అందుకున్నారు.
గతంలోనే మూసీనీ సుందరీకరిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చినా ఎలాంటి ముందడుగు పడలేదు. ఇప్పుడు రేవంత్ సర్కార్ మూసీ సుందరీకరణ కోసం మూసీ పరిసరాల్లోని నివాసితులకు ప్రత్యామ్నాయ మార్గాలు చూపించి ఇండ్ల కూల్చివేతలు చేపడుతామని ప్రకటించింది. ఈ క్రమంలోనే మూసీ బాధితులకు పరామర్శ అంటూ యాత్ర బయల్దేరుతుంది బీఆర్ఎస్. దీంతో హైదరాబాద్ లో అక్రమ కట్టడాలపై కేసీఆర్ వాదనకు వ్యతిరేకంగా హరీష్ , కేటీఆర్ ఉద్యమం చేపడుతున్నారని కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇస్తున్నారు.
గతంలో కేసీఆర్ మాట్లాడిన వీడియో…ఇప్పుడు కేటీఆర్, హరీష్ రావు వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ… కేసీఆర్ కు కేటీఆర్, హరీష్ రావు కౌంటర్ అంటూ కాంగ్రెస్ శ్రేణులు వైరల్ చేస్తున్నాయి.