నేను అనిల్ అంత ధనవంతుడ్ని కాదు.. అనిల్ దగ్గర ఉన్నటువంటి కారు లేదు… అనిల్ దగ్గర ఐ ఫోన్ ఉంది.. అనిల్ కు ఉన్నంత ఆస్తి లేదు… అని సునీల్ తాను ప్రేమించిన అమ్మాయి దగ్గర ప్రపోజ్ చేస్తే… కుదరదు కానీ…ఆ అనిల్ ఎక్కడ ఉంటాడో చెప్పు అంటుంది లవర్. ఇదో కామెడీ సీన్ కావొచ్చు కానీ.. అనిల ్గురించి అంతగా ఎందుకు చెప్పాల్సి వచ్చిందో అని సునీల్ తర్వాత బాధపడిపోతాడు. అందులో డౌట్ లేదు. తెలంగాణ ఎన్నికల ప్రచారం చూస్తూంటే ఇలాంటి సీనే గుర్తుకు వస్తుంది.
భారత రాష్ట్ర సమితి ప్రచార సరళి పూర్తిగా కాంగ్రెస్ సెంట్రిక్ గా సాగుతోంది. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత ఇలా ఎవరు ఆ పార్టీ కోసం ప్రచారం చేసినా.. ప్రసంగాల్లో ప్రధానంగా కాంగ్రెస్ నే టార్గెట్ చేస్తున్నారు. కాంగ్రెస్ వస్తే జరగకూడనివి జరిగిపోతాయని.. అలాంటి రిస్క్ తీసుకోవద్దని ప్రచారం చేస్తున్నరు. చివరికి ప్రచార చిత్రాల్లో కూడా అదే చెబుతున్నారు.రిస్క్ వద్ద కారు గుర్తుకు గుద్దు అని చెబుతున్నారు. బీఆర్ఎస్ ప్రచార వ్యూహం ఎలా ఉందంటే.. చివరికి సొంత పార్టీ మేనిఫెస్టో గురించి ఆ పార్టీ నేతలు సభల్లో ఎక్కువగా ప్రచారం చేయడం లేదు.
కాంగ్రెస్ వస్తే ఇప్పుడు వచ్చేవన్నీ ఆగిపోతాయని చెబుతున్నారు. ఇలా పూర్తిగా ఎందుకు కాంగ్రెస్ చుట్టూనే ప్రచారాన్ని తిప్పుతున్నారన్నది బీఆర్ఎస్ ద్వితీయ శ్రేణి నేతలకూ అంతుబట్టకుండా ఉంది.మారుతున్న రాజకీయ పరిస్థితికి తగ్గట్లుగా వ్యూహాలను మార్చుకోవడం రాజకీయ నేతల లక్షణం. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత మరిన పరిస్థితుల్ని బట్టే కేసీఆర్ కాంగ్రెస్ ను ఎక్కువగా టార్గెట్ చేసుకుంటున్నారని అంటున్నారు. కానీ టూ మచ్ గా తామే కాంగ్రెస్ కు ప్రచారం చేస్తున్నామేమో అన్న డౌట్ .. కింది స్థాయి బీఆర్ఎస్ నేతలకు వస్తోంది.