బీఆర్ఎస్ ఉత్తర తెలంగాణకు అన్యాయం నినాదం !

కేసీఆర్ రాజకీయం ప్రాంతీయ వాదం మీద ఉంటుంది. తెలంగాణ వాదంతో ప్రజల్ని ఏకం చేయగలిగారు. ఇప్పుడు అదంతా ఆవిరైపోయింది. బీఆర్ఎస్ కరిగిపోతోంది. ఇప్పుడు నిలబడాలంటే మరోసారి అదే వ్యూహం పాటించాలని డిసైడయినట్లుగా కనిపిస్తోంది. ఉత్తర, దక్షిణ తెలంగాణల నినాదాన్ని మెల్లగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. ఉత్తర తెలంగాణపై వివక్ష చూపిస్తున్నారని బీఆర్ఎస్ సొంత మీడియాలో పేజీలకు పేజీలు రాయడం ప్రారంభించారు.

రాజకీయంగా కీలక పదవులన్నీ అంటే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, స్పీకర్‌ వంటి కీలక పదవులు, కీలక శాఖలు దక్షిణ తెలంగాణకు చెందిన నాయకులకే దక్కాయిని బీఆర్ఎస్ నేతలు ప్రచారం ప్రారంభించారు. అదే సమయంలో ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్‌, నిజామాబాద్‌తోపాటు రంగారెడ్డి, హైదరాబాద్‌ ఉమ్మడి జిల్లాలకు కూడా ఇప్పటివరకు ప్రాతినిధ్యమే లేకుండాపోయిందని చెబుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ కూడా ఉత్తర తెలంగాణకు పెద్ద పీట వేశారు. ఇప్పుడు మాత్రం అన్యాయం చేశారని అంటున్నారు.

ఇప్పుడు రాజకీయంగా అన్యాయం జరుగుతోందని ప్రారంభించి తర్వాత… కాళేశ్వరం వంటి వాటి ద్వారా ఇతర విషయాల్లోనూ రేవంత్ సర్కార్ నిర్లక్ష్యం చేస్తుందని ప్రజల్లోకి వెళ్లాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇలా చేయడం ఉత్తర, దక్షిణతెలంగాణల మధ్య వివాదం తీసుకు రావడమేనని అది సొంతరాష్ట్రంలో చిచ్చు పెట్టినట్లుగా అవుతుందన్న భావన ఉన్నా.. బీఆర్ఎస్ మాత్రం ఇప్పటికిప్పుడు ఇంతకు మించిన దారి లేదన్న అభిప్రాయంలో ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఒకప్పుడు ఉత్తర తెలంగాణ బీఆర్ఎస్ కంచుకోట. ఇప్పుడు బీటలు వారిపోయింది. అందుకే సెంటిమెంట్ రాజకీయాలు మళ్లీ తప్పవన్న ప్లాన్‌లో కొత్త రాజకీయాలు ప్రారంభించినట్లుగా కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రజాభవన్‌లోనే చంద్రబాబు- రేవంత్ భేటీ

చంద్రబాబు ఆహ్వానానికి రేవంత్ రెడ్డి అంగీకారం తెలిపారు. నేనే వస్తానన్న చంద్రబాబు మాటకు తగ్గట్లుగా ప్రజాభవన్‌లోనే సమావేశం ఏర్పాటు చేశారు. ప్రజాభవన్ అే పేరును కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖరారు చేశారు....

నెల్లూరు సెంట్రల్ జైలుకు జగన్

వైసీపీ అధినేత జగన్ రెడ్డి నెల్లూరు సెంట్రల్ జైలుకు వెళ్లనున్నారు. నాలుగో తేదీన ఆయన తాడేపల్లి నుంచి హెలికాఫ్టర్ ద్వారా నెల్లూరు వెళ్తారు. అక్కడ జైల్లో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి...

7 మండలాలు కాదు 5 గ్రామాల కోసం రేవంత్

ఏపీ సీఎం చంద్రబాబుతో జరిగే భేటీలో ఏడు మండలాల కోసం పట్టుబట్టాలని .. ముందుగా ఆ అంశం తేల్చిన తర్వాతనే ఇతర అంశాల జోలికి వెళ్లాలని బీఆర్ఎస్ నేత హరీష్ రావు డిమాండ్...

అన్నవరం వచ్చేశాడు.. ఇక ఆడబిడ్డలూ వచ్చేస్తారు!

ఆంధ్రప్రదేశ్ లో మహిళల అదృశ్యంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. వెయ్యి కాదు..పదివేలు కాదు..ఏకంగా 30వేల మంది అమ్మాయిల ఆచూకీ లేదని పునరుద్ఘటించారు. ఇంత పెద్ద మొత్తంలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close