ఫార్ములా వన్ ఈ రేసుకు సంబంధించి స్పాన్సర్ షిప్ వ్యవహారంలో చాలా లోతు ఉందని తవ్వేకొద్దీ వెలుగులోకి వస్తోంది. తాజాగా గ్రీన్ కో , ఆ సంస్థ అనుబంధ కంపెనీలు రూ. 41 కోట్ల రూపాయలను ఎలక్టోరల్ బాండ్ల రూపంలో బీఆర్ఎస్కు ఇచ్చాయి. ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. దానిపై కేటీఆర్ స్పందించారు. ఎలక్టోరల్ బాండ్లు పూర్తి లీగల్ అని బీజేపీకి కూడా ఇచ్చిందని ఆయన చెబుతున్నారు.
ఎలక్టోరల్ బాండ్లు చెల్లవని సుప్రీంకోర్టు కొట్టివేసింది. అయితే అలా ఇప్పటి వరకూ తీసుకున్న విరాళాల విషయంలో మాత్రం ఎలాంటి చర్యలు తీసుకునేందుకు అవకాశం కల్పించలేదు. అంటే ఎలక్టోరల్ బాండ్లు లీగలే అనుకోవచ్చు. అయితే బీఆర్ఎస్ విషయంలో లీగలా.. ఇల్లీగలా అన్నది సమస్య కాదు. అనేక అనుమానాలను ఈ బాండ్లు కల్పిస్తున్నాయి. ఖచ్చితంగా స్పాన్సర్ షిప్ రద్దు చేసుకున్నప్పుడే ఎందుకు చెల్లించారు? ఫార్ములా ఈ స్పాన్సర్ షిప్ తో సంబంధం ఉన్న కంపెనీస్ ఇంత భారీగా ఎందుకు ఎలక్టోరల్ బాండ్లు ఇచ్చింది అన్నది సహజంగా అందరికీ వచ్చే డౌట్లు.
ఇవి లీగలే.. బీజేపీకి కూడా గ్రీన్ కో ఇచ్చింది అన్న కేటీఆర్ సమాధానం.. ఈ విషయంపై వచ్చే సందేహాలకు సమాధానం కాదు. ఇంకా పూర్తి వివరాలతో జస్టిఫికేషన్ ఇచ్చుకోవాల్సి ఉంది. లేకపోతే ఏదో గూడుపుఠాణి జరిగిపోయిందని ఎక్కువ మంది నమ్ముతారు.