రుణమాఫీ గురించి కేబినెట్లో చర్చించారో లేదో వెంటనే… అందరి ఖాతాల్లో డబ్బులు పడిపోయినట్లుగా మీడియా ప్రచారం చేస్తోందని బీఆర్ఎస్ నేతలు గుస్సా అయిపోతున్నారు. రుణమాఫీ విషయంలో జరుగుతునన్న ప్రచారంపై ప్రెస్ మీట్ పెట్టి మరీ నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి వంటి వారు అసనహానికి గురయ్యారు. ప్రభుత్వానికి మీడియా సపోర్టు చేస్తోందని నిజాలు చెప్పడం లేదని కూడా అన్నారు.
తెలుగు మీడియా ఇప్పుడు అధికార పార్టీలకు బానిసల్లా మారిపోయింది. ప్రధాన మీడియా చానళ్లు తెలంగాణ యాజమాన్యం చేతుల్లోకి వెళ్లిన తరవాత బీఆర్ఎస్ , వైసీపీ పార్టీల న్యూస్ మాత్రమే న్యూస్ అన్నట్లుగా మారిపోయింది. వారిని వ్య.తిరేకించే వారిపై ఈ న్యూస్ చానళ్లు విరుచుకుపడ్డాయి. తెలంగాణలో రేవంత్ రెడ్డి సీఎం కావడంతో ఒక్క సారిగా ప్లేట్ ఫిరాయించాయి. రేవంత్ రడ్డిని ఆహో..ఓహో అంటున్నాయి. కేబినెట్ భేటీలో ఓ నిర్ణయం తీసుకున్నారని రేవంత్ ను తెగ పొగిడేస్తూ కథనాలిస్తున్నాయి.. నిజానికి రుణమాఫీకి ప్రాథమిక విధానాలు కూడా ఖరారు చేయలేదు.. మీడియా హోరెత్తిస్తోంది.
ఈ పరిస్థితిని తీసుకు వచ్చింది బీఆర్ఎస్ నేతలే. వారు .. ఆయా టీవీ చానళ్ల యాజమాన్యాల వ్యాపారాలను గురిపెట్టో లేకపోతే వారితో పరోక్ష వ్యాపార సంబంధాలను పెట్టుకునో… ఆ మీడియాతో పొగిడించుకున్నారు. తీరా ఇప్పుడేమయింది… వారు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ భజన చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. మీడియా జోలికి బీఆర్ఎస్ వెళ్లకుండా ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదేమో ?