ఆంధ్రప్రదేశ్లో పోలీసుల తీవ్రమైన నిర్బంధాల మధ్య కూడా టీడీపీ నేతలు నిరసనలు నిర్వహిస్తున్నారు. అయితే తెలంగాణలో మాత్రం భారీ నిరసనలు జరుగుతున్నాయి. అన్ని చోట్లా జరుగుతున్నాయి. ఐటీ ఉద్యోగుల ప్రదర్శనలపై పోలీసులుఉక్కుపాదం మోపినప్పటికీ ఇతర చోట్ల జరుగుతున్న నిరసనలకు మాత్రం సహకరిస్తున్నారు. దీనికి కారణం వీటిని వైసీపీ నేతలే ఆరెంజ్ చేస్తున్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి స్వయంగా ర్యాలీకి నాయకత్వం వహించారు.
సుధీర్ రెడ్డి వైఎస్ కు చాలా దగ్గర. జగన్ రెడ్డికి కూడా బాగా దగ్గరే. అయినా ర్యాలీ నిర్వహించారు. టీడీపీ మద్దతు లేకపోతే ఎల్పీనగర్ లో గెలవడం అసాధ్యమని ఆయనకు తెలుసని అందుకే ర్యాలీ చేశారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. మరో వైపు మల్లారెడ్డి లాంటి వారు కూడా చంద్రబాబుది అక్రమ అరెస్ట్ అని జగన్ రెడ్డి తన గొయ్యి తాను తవ్వుకున్నారని అంటున్నారు. మరో వైపు ఖమ్మం, నిజామాబాద్ , నల్లగొండ, కోదాడ వంటి చోట్ల భారీ ర్యాలీలు జరుగుతున్నాయి. దీనికి బీఆర్ఎస్ లీడర్లే నాయకత్వం వహిస్తున్నారు.
ఇక హైదరాబాద్లోని కుషాయిగూడ సహా చాలా కాలనీల్లో ప్రదర్శనలు జరుగుతున్నాయి. అపార్టుమెంట్లు వారీగా మాట్లాడుకుని చంద్రబాబుకు సంఘిభావం చెబుతున్నారు. అత్యధికంగా ఎవరి ప్రమేయం లేకుండానే సంఘిభావం చెబుతున్నారు. బీఆర్ఎస్ క్యాడర్ గతంలో ఎక్కువగా టీడీపీ కావడంతో… తమ అభిమానాన్ని అలా చాటుకుంటున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. బీఆర్ఎస్ అగ్రనేతలు ఇంత వరకూ స్పందించలేదు కానీ ద్వితీయ శ్రేణి నేతల ర్యాలీలకు అడ్డు చెప్పడం లేదు. అలాంటి చేయవద్దని అనడం లేదు.