భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ ఎన్నికలకు పూర్తి స్థాయిలో సిద్ధమయ్యారు. అభ్యర్థుల కసరత్తును ఇప్పటికే పూర్తి చేశారు. మంచి రోజు చూసుకుని విడుదల చేయాలనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికలు అక్టోబర్చివరి వారంలో, లేదా నవంబర్ మొదటి వారంలోనే జరిగే అవకాశముందని అన్ని పార్టీలు అంచనా వేస్తున్నాయి. సెప్టెంబర్లోనే ఎన్నికల షెడ్యూల్ వచ్చే చాన్స్ ఉందని మంత్రి కేటీఆర్ చెబుతున్నారు. అందుకే అభ్యర్థుల జాబితాను రెడీ చేసారు. ప్రకటించాలని అనుకుంటున్నారు.
బీఆర్ఎస్ చీఫ్, సీఎం కేసీఆర్ అభ్యర్థులపై ఇప్పటికే ఓ అంచనాకు వచ్చారు జాబితా కూడా రెడీ చేసుకున్నారు. ఈ నెల 17 నుంచి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. 18న శ్రావణ మొదటి శుక్రవారం ఉంది. అదే రోజు లేదా ఆ తర్వాత బీఆర్ఎస్ అభ్యర్థుల మొదటి జాబితాను కేసీఆర్ ప్రకటించే అవకాశముందని బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్నారు. ఫస్ట్ లిస్టులోనే 105 పేర్లు ప్రకటించే అవకాశముందని కూడా అంచనా వేస్తున్నారు. ఒకవేళ 105 పేర్లు ప్రకటించకుంటే.. కేసీఆర్ లక్కీ నంబర్అయిన ‘6’ సంఖ్య వచ్చేలా అభ్యర్థుల లిస్ట్ ఉండొచ్చని చెప్తున్నారు.
పదేళ్లుగా అధికారంలో ఉండటంతో సిట్టింగ్ ఎమ్మెల్యేలపై అసంతృప్తి ఉందని సర్వేల్లో తేలింది. 40 మంది ఎమ్మెల్యేలపై అసంతృప్తి ఉందని.. వారిలో అతి ఎక్కువ వ్యతిరేకత ఉన్న 20 మందిని మార్చి కొత్తవాళ్లకు అవకాశం ఇవ్వనున్నట్టు చెబుతున్నారు. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, ఎమ్మెల్సీ కవిత ఇప్పటికే వేర్వేరు వేదికలపై అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యేలను భారీ మెజార్టీతో గెలిపించాలంటూ పిలుపునిచ్చారు. తద్వారా ఆ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఖరారు అయినట్టు సంకేతాలు ఇచ్చారు. కాంగ్రెస్, వీరిలో కాంగ్రెస్ , టీడీపీ నుంచి బీఆర్ఎస్లో జాయిన వారికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఒక్క వనమా వెంకటేశ్వరరావుకు మాత్రం ఇంకా ఖరారు చేయలేదని చెబుతున్నారు.