తెలంగాణ రాజకీయాల్లో గోషామహల్ ది ప్రత్యేక స్థానం. గత ఎన్నికల్లో బీజేపీ గెలిచింది అక్కడొక్కచోటే. అయితే నియోజకవర్గానికి సంబంధించినంత వరకూ ఆయన బీజేపీకి మించి ఎదిగారు. అందుకే సస్పెన్షన్ లో పెట్టి.. చివరికి ఎత్తేసి.. మరి సీటు ఇచ్చారు. రాజాసింగ్ ను ఓడించడానికి మజ్లిస్ … బీఆర్ఎస్ రూపంలో బాధ్యత తీసుకుకుంది. మజ్లిస్ అభ్యర్థిని నిలబెడితే… రాజాసింగ్ కు భారీ మెజార్టీ వస్తుంది. ముస్లింలతా మజ్లిస్ కు ఓట్లేస్తారు. అప్పుడు ఓట్లు చీలిపోతాయి.
అందుకే బీఆర్ఎస్ అభ్యర్థిని నిలబెట్టి గెలుపు బాధ్యతను మజ్లస్ తీసుకుంది. బీఆర్ఎస్ అభ్యర్ధి నందకిశోర్ వ్యాస్ కు గోషామహల్ లో పలుకుబడి ఉంది. ఉత్తరాది ఓట్లు వస్తాయని ఆశలు పెట్టుకుంటున్నారు. 70వేల వరకూ ఉన్న ముస్లిం ఓట్లు వస్తాయని భావిస్తున్నారు. గ్రేటర్ లో అతి చిన్న నియోజకవర్గం గోషామహల్. అరవై శాతం వరకూ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారి ఓట్లే ఉంటాయి. రాజాసింగ్, నందకుమార్ వ్యాస్ ఇద్దరూ బయట రాష్ట్రాల నుంచి వచ్చి స్థిరపడిన వారే.
రాజాసింగ్ ముస్లింలకు వ్యతిరేకంగా అందర్నీ ఏకం చేయడంలో విజయవంతం అయ్యారు. రాజాసింగ్ ఇప్పటికే పాదయాత్రల ద్వారా గోషామహల్ నియోజకవర్గాన్ని చుట్టేశారు. ఆయనను ఓడించడమే తమ లక్ష్యమని మజ్లిస్ నేతలు చెబుతున్నారు. ఇక్కడ ప్రచారం చేసేందుకు బీఆర్ఎస్ అగ్రనేతలు ఎవరూ రావడం లేదు. కాంగ్రెస్ తరపున సునీత రావు అనే నేతకు టిక్కెట్ ఇచ్చారు. ఆమె స్థానికురాలు కాదు. దీంతో కాంగ్రెస్ ప్రభావం నామమాత్రంగా ఉండే అవకాశం ఉంది.