ఎప్పుడు ఏ ఎమ్మెల్యే పార్టీ మారుతారో… ఏ నాయకుడు పార్టీని వీడారని వార్త వినిపిస్తుందో అన్న టెన్షన్ లో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి మరిన్ని షాకులు తగిలేలా కనపడుతున్నాయి. అసెంబ్లీ మొదలయ్యే లోపే విలీన ప్రక్రియ పూర్తిచేస్తామంటున్న కాంగ్రెస్ వ్యాఖ్యలకు బలం చేకూర్చేలా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరు కనపడుతోంది.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రోటోకాల్ ఇష్యూ, ఎమ్మెల్యేల ఫిరాయింపులపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేలంతా స్పీకర్ ను కలవాలని నిర్ణయం తీసుకున్నారు. హరీష్ రావు-కేటీఆర్ ల ఆధ్వర్యంలో స్పీకర్ ను కలబోతున్నందున… అందరూ ఈ మీటింగ్ రావాలని సమాచారం ఇచ్చారు.
కానీ, బీఆర్ఎస్ పిలుపుకు 14మంది ఎమ్మెల్యేలు డుమ్మాకొట్టారు. కేసీఆర్ ను తీసేస్తే… 13మంది ఎమ్మెల్యేలు ఎందుకు రాలేదు అన్న చర్చ ఇప్పుడు జోరుగా సాగుతోంది. బీఆర్ఎస్ కు 38మంది ఎమ్మెల్యేలు ఉండగా… అందులో 10మంది కాంగ్రెస్ గూటికి చేరారు. మిగిలిన 28మందిలో కేవలం 14మందే స్పీకర్ ను కలిసే మీటింగ్ వచ్చారు. తాజాగా డుమ్మా కొట్టిన వారిలో మాజీ మంత్రి మల్లారెడ్డి పలువురు ఎమ్మెల్యేలున్నారు.
డుమ్మాకొట్టిన వారంతా పార్టీ మారబోతున్నారా…? వచ్చిన వారిలోనూ ఎవరెవరు ఉంటారో… అన్న చర్చ జోరుగా సాగుతోంది.