సుప్రీం కోర్టులో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసుకున్న కేసు విచారణ మూడు వారాలకు వాయిదాపడింది. ఈడీ కార్యాలయంలో మహిళలను పిలిచి విచారణ చేయొద్దని కవిత పిటిషన్ దాఖలు చేసింది. తన నివాసంలోనే విచారణ చేయాలని విజ్ఞప్తి చేసింది. ఈ పిటిషన్ను నళిని చిదంబరం కేసుతో కవిత కేసు ట్యాగ్ చేసిన సుప్రీంకోర్టు… తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. అయితే ఇలా ట్యాగ్ చేయడాన్ని అడిషనల్ సొలిసిటర్ జనరల్ వ్యతిరేకించారు. కానీ సుప్రీంకోర్టు మాత్రం ఈ కేసులో చాలా కోర్ అంశాలున్నాయన్నారు.
అన్నింటినీ లోతుగా విచారణ చేయాల్సి ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కవిత తరపున సీనియర్ లాయర్ కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. ఈ కేసులో కవిత నిందితురాలు కాదన్నారు. సమన్ల విషయంలో ఈ డీ ఎలాంటి ప్రొసీజర్ ఫాలో కాలేదన్నారు. చార్జి షీట్ ఇప్పటికే దాఖలు చేశారని అందుకే
నళిని చిదంబరం కేసులతో దీన్ని ట్యాగ్ చేయాలని సూచించారు. సిబల్ విజ్ఞప్తిని సుప్రీంకోర్టు ధర్మాసనం అంగీకరించింది.
అయితే లిక్కర్ స్కాం కేసు విచారణ ఈ వాయిదాపై ప్రభావం పడే అవకాశం లేదని భావిస్తున్నారు. ఈ పిటిషన్ విచారణ తర్వాత కూడా కవిత రెండు రోజులు ఈడీ ఆఫీసుకు వెళ్లారు. రాత్రి పది గంటల వరకూ విచారణ ఎదుర్కొన్నారు. కవితను మళ్లీ పిలుస్తామని ఈడీ అధికారులు చెప్పారు కానీ మళ్లీ విచారణ ఎప్పుడన్నదానిపై క్లారిటీ లేదు. ఓ రకంగా సుప్రీంకోర్టు ఏ నిర్ణయమూ వెలువరించకపోవడం కవితకు ఊరటనిస్తుందని భావిస్తున్నారు.