బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులను దాదాపుగా ఖరారు చేసుకున్నారు. చాలా నియోజకవర్గాలకు ఒక్కొక్క పేరు రెడీ అయింది. ఖమ్మంకు ఎంపీ నామా నాగేశ్వరరావునే ఖరారు చేశారు. చేవెళ్లకు గడ్డం రంజిత్ రెడ్డి, జహీరాబాద్ కు బీబీ పాటిల్, కరీంనగర్ కు బోయినపల్లి వినోద్ కుమార్, ఆదిలాబాద్ కు ఆత్రం సక్కు, నిజామాబాద్ కు బాజిరెడ్డి గోవర్ధన్ పేర్లను దాదాపుగా ఖరారు చేశారు. మల్కాజిగిరి నుంచి ఎమ్మెల్యే మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డికే చాన్సిచ్చారు. సికింద్రాబాద్ నుంచి తలసాని కుమారుడు సాయికిరమ్ యాదవ్ కు మరోసారి చాన్సివ్వనున్నారు.
ఇక నల్లగండ స్థానాలకు పోటీ ఎక్కువగా ఉంది. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు గుత్తా అమిత్ రెడ్డి.. నల్లగొండ లేదా భువనగిరిలో ఏదో ఓ చోట అవకాశం కల్పించనున్నారు. నల్లగొండకు తేరా చిన్నపరెడ్డి పేరు కూడా పరిశీలనలో ఉంది. భువనగిరికి గుత్తా అమిత్ తో పాటు పైళ్ల శేఖర్ రెడ్డి, జిట్టా బాలకృష్ణారెడ్డి, బాలరాజు యాదవ్ పేర్లను కూడా పరిశీలిస్తున్నారు. పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్ లేదా.. బ ాల్క సుమన్ కు చాన్సివ్వనున్నారు. ఇక గెలుపు ఖాయమని భావిస్తున్న మెదక్ నుచి వంటేరు ప్రతాప్ రెడ్డి లేదా చిలుముల మదన్ రెడ్డి పోటీ చేస్తారు. వీరిద్దరికీ కేసీఆర్ ఎంపీ టిక్కెట్ హామీ ఇచ్చారు. వరంగ్ల నుంచి కడియం కావ్య , ఆరూరి రమేష్, ఎర్రోళ్ల శ్రీనివాస్, పి దయాకర్ పేర్లను పరిశీలిస్తున్నారు. మహబూబాబాద్ నుంచి సీతారాం నాయక్ , రెడ్యానాయక్ , మాలోతు కవితల్లో ఒకర్ని నిలబెట్టనున్నారు మహబూబ్ నగర్ నుంచి మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, శ్రీనివాసగౌడ్ పేర్లు వినిపిస్తున్నాయి. నాగర్ కర్నూలుకు సీట్టింగ్ ఎంపీ పోతుగంటి రాములు పేరు వినిపిస్తోంది.
అయితే వీరిలో చాలా మంది పోటీపై సందిగ్ధంలో ఉన్నారు. చేవెళ్ల ఎంపీ పోటీ చేయడానికి సిద్ధంగా లేరని చెబుతున్నారు. జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ కూడా అంతే. ఆయన అందబాటులో లేరు. నాగర్ కర్నూలు ఎంపీ పోతుగంటి రాములు పార్టీ మారిపోతారన్న ప్రచారం జరుగుతోంది. ప్రాబబుల్స్ మాత్రం రెడీ అయ్యాయి… ఫైనల్ గా ఎవరు పోటీలో ఉంటారో అంచనా వేయడం బీఆర్ఎస్ నేతలకూ సాధ్యం కావడం లేదు.